సిక్స్ ప్యాక్: ‘మెగా’ హీరోలతో సింక్ అవుతాడా?
హైదరాబాద్: ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన వారంతా తొలి సినిమా తోనే తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లతో పాటు నిన్న మొన్న వచ్చి సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా తమలో సత్తా ఉందని నిరూపించుకున్నారు.
అయితే ఒక్కడు మాత్రం....ఎందుకో మెగా ఫ్యామిలీ హీరోలు అనే పదంతో సింక్ కాబలేక పోతున్నాడు. అతడు మరెవరో కాదు అల్లు శిరీష్. వాస్తవానికి అల్లు శిరీష్ తొలి సినిమా ‘గౌరవం' అతని కెరీర్‌పై తీవ్రమైన ప్రభావం చూపింది. ఆ తర్వాత ‘కొత్త జంట'తో కాస్త ఫర్వాలేదనిపించినా ఎందుకో తగిన గుర్తింపు రాలేదు.

అందుకే ఈ సారి అల్లు శిరీష్ తనదైన గుర్తింపు తెచ్చుకోవడం కోసం కాస్త కొత్తగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. తన తర్వాతి సినిమాలో సిక్స్ ప్యాక్ తో దర్శనమివ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. శిరీష్ తర్వాతి సినిమా తన సొంత బేనర్ ‘గీతా ఆర్ట్స్'లో తెరకెక్కబోతోంది.
దర్శకుడు పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. మరి సిక్స్ ప్యాక్ ద్వారా అయినా అల్లు శిరీష్ మెగా ఫ్యామిలీ హీరోలతో సింక్ అవుతాడో లేదో చూడాలి. ఏది ఏమైనా అతనికి బెస్టాఫ్ లక్ చెబుదాం.


Click it and Unblock the Notifications











