పొరుగువారిని గౌరవించు...స్వంతవారిని ప్రేమించు: అల్లు శిరీష్
ప్రతి తమిళ సినిమాలో వాళ్ళ భాష-సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకుంటారు. చూసి ముచ్చటేస్తాది, మనం ఇలా లేమే అని బాదోస్తాది. మన సినిమాల్లోనూ మన జాతి గొప్పతనం గుర్తిస్తూ డైలాగ్లు పెట్టుకోవాలి. 'పొరుగు భాషలను గౌరవిచ్చు, మాతృభాషని కౌగిలించు!"ఈవాళ చూసిన సినిమా చూసి బాధ వేసింది. హీరో 'మన తమిళోల్లు" అన్నాడే కాని 'మన భారతీయులు" అని ఎక్కడ అనలేదు. మరీ అల చెయ్యడం కూడా మంచిది కాదు...అని ట్వీట్ చేసారు. అనేక కారణాల వల్ల చాల మందికి నాతో విరోధం ఉండొచ్చు, కాని అవన్నీ దాటుకొని తెలుగు తల్లి 'వీడు నా బిడ్డ" అని గర్వంగా చెప్పుకోనేల చేస్తా....
ఇలా ట్వీట్ చేస్తున్నందకు నన్ను క్షమించండి..మనసులో ఉన్న మాట చెప్పాలనిపించింది..గుడ్ నైట్..హావ్ ఎ గ్రేట్ వీక్ ఎండ్! అంటూ... అల్లు అర్జున్ తమ్ముడు... అల్లు శిరీష్...... తన మనసులోని భావాల్ని... ఓ తమిళ సినిమా చూసినప్పుడు కలిగిన అనుభూతిని ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు. అయితే తనకు చాలామందితో విరోధం ఉందన్నాడు.. ఎవరితో అంటే మాత్రం... లేనిపోని గొడవలొస్తాయి...ఎందుకులే అని సమాధానమిచ్చాడు. ఇక తెలుగు తల్లి గర్వపడేలా చేస్తానని శపథం చేశాడు. ఇంతకూ శిరీష్ ఏం చేస్తాడు? ఏం చేయబోతున్నాడు?...వెయిట్ అండ్ సీ....


Click it and Unblock the Notifications











