అల్లు వారి టీవీ ఛానెల్!?
అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ ఓ టీవీ ఛానెల్ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొన్న ఎలక్షన్ లో సొంత ఛానెల్ ఉంటే తమ పార్టీ లెక్క వేరే రకంగా ఉండేదని అందరూ అనటం కూడా ఆలోచించినట్లయింది. అయితే ఇప్పడు శిరీష్ పెట్టే ఛానెల్ న్యూస్ ఛానెల్ కాదట. పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ ఛానెల్ అని తెలుస్తోంది. సౌత్ లో నాలుగు బాషలు వారు చూసేలా ఈ ఛానెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం సినిమా రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు. అలాగే కొన్ని డిఫెరెంట్ పోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అందులోనూ సౌత్ స్కోప్ అనే పత్రిక పెట్టి సౌత్ ని ఆకట్టుకునే ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇవ్వటమే ఈ టీవీ ఛానెల్ ఆలోచనకు ఊతం ఇచ్చినట్లయిందంటున్నారు. అయినా తనకు ఉన్న మాటీవీ ని ఏ రకంగానూ తమ క్రియోటివిటీకి వినియోగించుకోలేకపోవటమే ఈ నిర్ణయానికి కారణమని వినికిడి. ఏదైమైనా నాలుగు భాషల చిత్రాలు ప్రదర్శించే తొలి దక్షిణాది సినీ ఛానెల్ గా తన ఛానెల్ ని ప్రమోట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.బెస్ట్ ఆఫ్ లక్.


Click it and Unblock the Notifications











