ఆ రేంజ్ ఆఫర్ చేస్తేనే ఓకే.. హాట్ హీరోయిన్ డిమాండ్ చూసి నిర్మాతలు ఏం చేశారంటే!

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ డిమాండ్ చూసి షాక్ అవుతున్నారు దర్శకనిర్మాతలు. కెరీర్ ఆరంభంలోనే ఈ రేంజ్ డిమాండ్ చేస్తే ఇక ఓ స్టేజ్‌కి వెళ్ళాక అమ్మడు ఎలాంటి కండీషన్స్ పెడుతుందో అని చెప్పుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే.. బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కోసం ఎక్కడలేని డిమాండ్ నిర్మాతల ముందు పెట్టిందట నిధి.

సంతోష్ శ్రీ‌నివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం 'అల్లుడు అదుర్స్' అనే సినిమాను చేస్తున్నాడు. సుమంత్ మూవీ ప్రొడ‌క్షన్స్ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ సినిమాలో న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

Alludu Adurs: Nidhhi Agerwal demand for item song

ఇకపోతే స్టార్ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తూ క్రేజ్ కొట్టేయడం బెల్లంకొండ శ్రీనివాస్‌కి మొదటినుంచే అలవాటు. ఈ బాటలోనే ఆయన లేటెస్ట్ మూవీ 'అల్లుడు అదుర్స్'లో ఐటెం సాంగ్ కోసం నిధిని సంప్రదించి 60 లక్షలు ఆఫర్ చేశారట. అయితే ఆమె మాత్రం 80 లక్షలకు తగ్గితే చేసే ఛాన్సే లేదని తెగేసి చెప్పేసిందట. దీంతో షాకైన ఆ నిర్మాతలు నిధిని కాదనుకొని మరో హీరోయిన్ కోసం వేట ప్రారంభించారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X