దిమాక్ ఖరాబ్ చేస్తున్న నిధి అగర్వాల్.. యంగ్ హీరోతో! ఏకంగా 80 లక్షలు..
'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ చిత్రసీమకు పరిచయమైన అందం నిధి అగర్వాల్. ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో అందాలన్నీ ఆరబోసి యువత దిమాక్ ఖరాబ్ చేసింది ఈ బ్యూటీ. డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఆమె అందాలను అందరికీ చేరువ చేసి భారీ క్రేజ్ తెచ్చిపెట్టారు.
దీంతో తెలుగు చిత్రసీమలో నిధి అగర్వాల్ డిమాండ్ పెరిగింది. వరుస ఛాన్సులు వస్తున్నాయి. ఇటీవలే మహేష్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం కొట్టేసిన నిధి అగర్వాల్.. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా 'అల్లుడు అదుర్స్'లో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసిందట.

బెల్లకొండ శ్రీనివాస్ సినిమాల విషయానికొస్తే.. ఆయన ప్రతీ సినిమాలోనూ భారీ క్యాస్టింగ్ ఉంటుంది. స్టార్ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తూ క్రేజ్ కొట్టేయడం మనోడికి వెన్నతో పెట్టిన విద్య. ఈ నేపథ్యంలోనే తన లేటెస్ట్ మూవీ 'అల్లుడు అదుర్స్'లో ఐటెం సాంగ్ కోసం నిధిని తీసుకున్నారట. అయితే ఈ ఒక్క సాంగ్ చేసినందుకు గాను ఆమెకు 80లక్షల పారితోషికం ఆఫర్ చేశారట మేకర్స్. దీంతో ఈ సాంగ్ చేయడానికి నిధి అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో టకెక్కుతున్న 'అల్లుడు అదుర్స్' మూవీలో 8 ప్యాక్స్‌తో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆయన సరసన నభా నటేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











