యువదర్శకుడితో అమల ఎఫైర్ కన్పర్మ్
నాగచైతన్య సరసన బెజవాడరౌలు చిత్రంలో నటిస్తున్న తార అమలపాల్. ప్రస్తుతం అమల పలు తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. సెక్సీ పర్సనాలిటీతోపిటపిటలాడుతున్న అమలతో రొమాన్స్ చేయడానికి చాలా మంది హీరోలు తహతహలాడుతున్నారు. ఇలా మంచి ఊపు మీద ఉన్న హీరోయిన్లపై గాసిప్స్ వినపడటం సర్వ సాధారణం. తాజాగా అలాంటిదే ఒకటి తమిళ సినీ సర్క్యూట్ లో వినిపిస్తోంది.
తమిళ యువ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ తో అమల ఎఫైర్ పెట్టుకుందని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్ రూపొందించిన 'నాన్న" సినిమాలో అమల నటించినప్పుడే వీళ్ల మధ్య బంధం బలపడిందట. అప్పటి నుంచి పలు ప్రైవేట్, పబ్లిక్ ప్లేసుల్లో చాలా క్లోజ్ గా ఒకరికొకరు రాసుకుపూసుకు తిరుగుతూ కనిపిస్తుండటంతో వీళ్ల మధ్య ఏదో 'సం"బంధం ఉందనే మాట గత కొంతకాలంగా వినిపిస్తోంది. తాజాగా అది నిజమేనని రుజువైంది.
ఇటీవల అమల ప్రత్యేకంగా చెన్నయ్ నుంచి హైదరాబాద్ వచ్చి విజయ్ పేరెంట్స్ షష్ఠి పూర్తి ఫంక్షన్ లో పాల్గొంది. ప్రత్యేకించి ఇలాంటి ఫంక్షన్ కు అమల రావడంతో ఇద్దరి మధ్య సంబంధం ఉందనే వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. అయితే బండారం బయట పడ్డా..అమల మాత్రం నిజం ఒప్పుకోండానికి నిరాకరిస్తుండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











