అమలకు టబు భయం లేదట
కృష్ణవంశీ తీసిన 'నిన్నేపెళ్ళాడుతా' చిత్రంలో నటించినప్పటి నుంచీ ఆ చిత్ర నాయకానాయికలు నాగార్జున, టబుల మధ్యన ఏదో వుందని రోజుకో పుకారు రావడం మామూలయిపోయింది. దీనికి తగ్గట్టుగా నాగార్జున, టబులు చనువుగా మెలగటం అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. నాగార్జున టబును పెళ్లి చేసుకున్నాట్ట, టబు కోసం ముంబాయ్ లో ఓ ఫ్లాట్ కొన్నాడుట.....ఇవన్నీ గాసిప్స్ లో భాగమే. ఈ మధ్యే హైదరాబాదు లో జరిగిన 56వ ఫిలిం ఫేర్ అవార్ఢుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నాగార్జున టబు ను విష్ చేసిన విధానం మళ్లీ ఈ గాసిప్స్ కు ప్రాణం పోసింది.
ఇప్పుడీ సోదంతా ఎందుకంటే ఈ మధ్య ఓ తెలుగు దినపత్రిక అమల, టబులతో ఇంటర్యూ ప్రచురించింది. అందులో అమల - నాగార్జున, టబుల సంబంధం గురించి మాట్లాడుతూ వాల్లిద్దరూ మంచి స్నేహితులు, ఫిలిం ఫేర్ అవార్ఢుల కార్యక్రమంలో నాగార్జున, టబు ను విష్ చేసినప్పుడు తాను పక్కనే వున్నానని, తాను దాని గురించి అస్సలు వర్రీ అవ్వట్లేదని తెలిపారు. అంతే కాకుండా ఇలాంటి గాసిప్స్ వింటే నవ్వుకోవడం తప్పించి ఎక్కువగా ఆలోచించనని చెప్పింది. కాబట్టి అమలకు లేని బాధ గాసిప్ జోన్ కి ఎందుకో....


Click it and Unblock the Notifications











