twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బెజవాడ' చిత్రంలో ఆమె వంగవీటి రత్నకుమారి?

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తయారవుతున్న 'బెజవాడ' సినిమా ఒకప్పుడు బెజవాడని తమ ఆధిపత్య పోరాటంలో భాగంగా చేసిన వంగవీటి, దేవినేని కుటుంబాల కథగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో వంగవీటి రంగా, రత్నకుమారి ప్రేమ కోణం కూడా ఉందని తెలుస్తోంది. అలాగే నాగచైతన్య, అమల చేస్తున్న పాత్రలు రంగా, రత్నకుమారి పాత్రల్ని పోలి ఉంటాయని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. వంగవీటి రత్నకుమారి గా అమలా పౌల్ గెటప్ తీర్చి దిద్ది చేస్తున్నారని చెప్తున్నారు.కాగావారి మధ్య రెండు డ్యూయెట్లని కూడా తీస్తున్నారు. అది కూడా స్విట్జర్లాండ్, ఇటలీ, ఒమన్ వంటి విదేశీ లొకేషన్లలో. సెప్టెంబర్ 15 నుంచి తీస్తున్న ఈ పాటల్ని 25కి పూర్తిచేస్తారు. వివేక్‌కృష్ణ డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ సినిమాని దీపావళికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.ఇక అమలాపౌల్ విషయానికి వస్తే ఆమె ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన తమిళ సినిమా 'మైనా' (తెలుగులో ఇది 'ప్రేమఖైదీ'గా వచ్చింది)తో పరిచయమైది. ఆ తర్వాత విక్రమ్ హీరోగా వచ్చిన నాన్న చిత్రంలో కీ రోల్ ని చేసింది.

    ఇప్పుడు అమలా పౌల్ తో చేయాలి తెలుగు హీరోలంతా ఉవ్విళ్లూరుతున్నారు. బెజవాడ హిట్టైతే ఆమె దశ మారినట్లే అని చెప్తున్నారు. ఇక బెజవాడ చిత్రాన్ని కూడా రామ్ గోపాల్ వర్మ తన రక్త చరిత్ర తరహాలో భారిగా పబ్లిసిటీ చేసి మంచి ఓపినింగ్స్ తేవాలని ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ వివాదంతో అందరి నోళ్ళలో నలిగింది. ఇంక ట్రైలర్స్ విడుదల చేసిన తర్వాత చాలా వివాదాలు చెలరేగి, సినిమాకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. . ఇక ''దుర్మార్గులను అంతం చేయాడానికి ఒక్కోసారి దుర్మార్గుడిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది. తను పుట్టి పెరిగిన 'బెజవాడ' జోలికొస్తే ఎంతటివారినైనా ఎదిరించేందుకు సిద్ధమైన యువకుడి కథ 'బెజవాడ'. ఆ యువకుడుగా నాగచైతన్య కనిపిస్తారు.అలాగే ఎవరైనా సరే పుడుతూనే కత్తి పట్టుకొని పగతో రగిలిపోరు. పరిస్థితులే వాళ్లలో కక్షల్నీ, కార్పణ్యాల్నీ పెంచుతాయి. మా కథలోని యువకుడు ఏ కారణాలతో రౌడీగా మారాల్సి వచ్చింది. అతని లక్ష్యం ఏమిటి అన్నది తెర మీదే చూడాలి నాగచైతన్య నటన తప్పకుండా మాస్‌ ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు దర్శకుడు వివేక్‌కృష్ణ.

    English summary
    Director Vivek Krishna said that Bezawada released on Deepavali.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X