twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా క్యాంప్ ఎఫెక్టు... ఒక్కసారిగా పెంచేసింది

    By Srikanya
    |

    హైదరాబాద్: చేసింది కొన్ని సినిమాలే అయినా పారితోషికం భారీగా పెంచిన హీరోయిన్ అమలా పాల్‌. తమిళంలో 'మైనా'(ప్రేమ ఖైది తెలుగు)తో సంచలన హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది అమలా పాల్‌. ఆపై విక్రమ్‌, జయం రవి.. ఇలా పెద్ద హీరోల సరసన ఎంపికయ్యింది. ఇప్పుడు తెలుగులోనూ హవా చాటుతోందీ చిన్నది. రామ్‌ చరణ్‌తో 'నాయక్‌', అల్లు అర్జున్‌తో 'ఇద్దరమ్మాయిలుతో ' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మెగా క్యాంప్ అభిమానాన్ని చూరుగొన్న ఈ అమ్మడు కూడా ఒక్కసారిగా పారితోషికాన్ని రూ.కోటికి చేర్చింది.

    అమలా పాల్ ఇంతకుముందు నాగచైతన్య సరసన బెజవాడ చిత్రం చేసినా అది కమర్షియల్ గా విజయం సాధించలేదు. దాంతో సైలెంట్ గా ఉంది. అయితే ఎప్పుడైతే మెగా హీరోలు ఆమెను తమ సినిమాల్లో తీసుకున్నారో అప్పటినుంచి ఆమె తన రేటు పెంచేసి మిగతా నిర్మాతలకు ట్విస్ట్ ఇచ్చింది. ఆమెతో సినిమాలు చేద్దామనుకున్న కొందరు నిర్మాతలు పునారాలోచనలో పడ్డారు. కోటి ఆమెకు ఇచ్చేకన్నా తమన్నా,కాజల్ తో ముందుకెళ్లటం బెస్ట్ అని భావిస్తున్నారు. అయితే సెలిక్టివ్ గా సినిమాలు చేయటానికే తను రేటు పెంచానని అమలా పాల్ తన సన్నిహితులలో చెప్తున్నట్లు తెలుస్తోంది.

    ఇక అమలా పాల్‌ ఎఫెక్ట్ మరో హీరోయిన్ పై పడింది. ఆమె కోవలోనే తమిళంనుంచి తెలుగుకు వచ్చిన అంజలి తన రెమ్మయునేషన్ పెంచేసింది. పారితోషికం విషయంలో రూ.కోటి క్లబ్‌లో చేరిపోయింది అంజలి. తమిళ వెండితెరపై 'అంగాడి తెరు', 'ఎంగేయుం ఎప్పోదుం', 'మంగాత్తా', 'కలగలప్పు' తదితర చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ తెలుగమ్మాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ అవకాశాలు దక్కించుకున్నారు.

    భారీ మల్టీస్టారర్‌ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో నటిస్తున్నారు. ఇటీవలే సూర్య నటిస్తున్న 'సింగం-2'లో ప్రత్యేక పాటలోనూ నర్తించారు. తొలినాళ్లలో చక్కని అభినయానికి అవకాశమున్న పాత్రలతో విజయవంతమైన హీరోయిన్‌గా పేరు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. దీంతో నిర్మాతలు కూడా అడిగినంత ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.

    English summary
    Sources say Amala is being offered Rs 90 lakhs by Tollywood producers as well. Currently, Amala is busy with her Malayalam projects but the buzz is that producers are coming forward to shell out Rs 1 crore to get her back to Tollywood. For now, this dusky beauty is minting money from all ends.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X