నాన్న డైరెక్టర్ తో లవ్ లో పడ్డ అమల..!?
నాన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమల పౌల్ స్టార్ తిరిగింది. ఒక్క సినిమాతోనే దక్షిణాది ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రేమఖైదీ డబ్బింగ్ సినిమాతో కమర్షియల్ గా సక్సెస్ కాకపోయిన మరింత క్రేజ్ మాత్రం సొంతం చేసుకొన్నది. ఆ క్రేజ్ తోనే రామ్ గోపాల్ వర్మ కళ్ళకు చిక్కింది. వర్మ దర్శకత్వంలో అమలా పాల్ ప్రస్తుతం నాగచైతన్య సరసన 'బెజవాడ" చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
మంచి అందము, ఆకృతి ఉన్న ఈ కేరళ కుట్టి 'నాన్న" దర్శకుడు విజయ్ ప్రేమలో పడ్డారని సమాచారం. అమలాపాల్ చెన్నైలో షూటింగ్స్ చేస్తున్నప్పుడు విజయ్ ఇంటి నుంచే ఆమెకు భోజనం పంపిస్తున్నారట. అలాగే ఇటీవల విజయ్ బిఎండబ్ల్యూ కార్ తెప్పించాడట కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అమలాపాల్ వచ్చే వరకు డ్రైవ్ చేయకుండా వెయిట్ చేశాడని భోగట్టా...తను వచ్చిన తర్వాత ముందు సీట్లో కూర్చోబెట్టుకొని, టెస్ట్ డ్రైవ్ చేశాడట. ఈ తతంగమంతా చూసినవాళ్లు విజయ్, అమలా ప్రేమలో పడ్డారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











