మహేష్ ప్రక్కన అమలా పౌల్ ఖరారు?

By Srikanya

Amala Paul
బెజవాడ చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన ముద్దుగుమ్మ అమలా పౌల్. ఆమెను మహేష్ బాబు తాజా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో హీరోయిన్ గా ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సమంత డేట్స్ ఎడ్డెస్ట్ కాకపోవటంతో ఆమెను వద్దనుకుని దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక మహేష్,సమంత కాంబినేషన్ లో వచ్చిన దూకుడు సూపర్ హిట్ కావటంతో ఈ జంటను రిపీట్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమె ఇప్పుడు డేట్ల సమస్యలో కూరుకుపోయింది. ఆమెపై రీసెంట్ గా బెల్లంకొండ సురేష్ సైతం నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసారు. నందినీరెడ్డి దర్సకత్వంలో రూపొందే చిత్రం కోసం ఆమె డేట్స్ తీసుకున్నారు.

అయితే ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ సరసన ఎవడు లోనూ, గౌతమ్ మీనన్ ట్రైలిగ్వువల్ చిత్రంలోనూ,నాగచైతన్య ఆటోనగర్ సూర్యలోనూ బిజీగా ఉంది. దాంతో ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ కు హాజరుకాలేకపోవటంతో షూటింగ్ వాయిదా వేసుకున్నారు. ఓ ప్రక్క చిత్రంలో మరో హీరోగా చేస్తున్న వెంకటేష్ సరసన చేసే వారు దొరకక తలపట్టుకు కూర్చున్న నేపద్యంలో సమంత డేట్స్ సమస్యను కూడా ఫేస్ చేయటం కష్టమనిపించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని అడ్డాల శ్రీకాంత్ డైరక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో వెంకటేష్,మహేష్ అన్నదమ్ములుగా కనిపించనున్నారు. వారి తల్లి తండ్రులుగా జయసుధ,ప్రకాష్ రాజ్ అలరిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X