చివరకు వెంకీకి అమల పాల్‌ను సెట్ చేశారు...!
విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే మల్టీ స్టారర్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో వెంకీ అన్నయ్య పాత్రలో, మహేష్ బాబు తమ్ముడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఇప్పటికే సమంత ఖరారైంది. అయితే వెంకీకి మాత్రం ఇంకా హీరోయిన్ దొరక లేదు. త్రిషను ఎంపిక చేద్దామకున్నప్పటికీ మహేష్ వదిన పాత్ర చేయాల్సి వస్తుందని ఒప్పుకోలేదు. భూమికను బుక్ చేద్దామన్నా వీలు కాలే. కాల్సీట్లు లేవంటూ అనుష్క కూడా నో చెప్పింది.
అయితే ఎట్టకేలకు వెంకీ భార్య పాత్రలో నటించే హీరోయిన్ దొరికినట్లు తెలుస్తోంది. బెజవాడ చిత్రంలో నాగచైతన్య సరసన నటించిన అమలపాల్ ఈ సినిమాలో వెంకీ భార్య పాత్రకు ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొత్త బంగారు లోకం ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ చిత్రంలో బిజీగా గడుపుతుండగా...వెంకీ తన తాజా సినిమా బాడీగార్డ్ విడుదలపై చాలా ఆసక్తిగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











