ఆఫర్స్ రావనే అర్దమయ్యే ఈ బిల్డప్ లు

By Srikanya

హైదరాబాద్ : పెళ్లైన హీరోయిన్స్ కు సాధారణంగా ఆఫర్స్ తగ్గిపోతూంటాయి. హీరోలెవరు తమ సరసన తీసుకోవటానికి ఆసక్తి చూపరు. దాంతో కొంతకాలం గ్యాప్ తీసుకుని ఆంటి లుక్ తో అక్క, అమ్మ పాత్రలకు సిద్దమవుతూంటారు. ఇంకొంతమంది టీవిలకు వలస పోతూంటారు. ఈ విషయాలన్నీ ముందే పసిగట్టినట్లుంది అమలాపాల్. ఎలాగూ వివాహానంతరం హీరోలు దగ్గరకు చేరనివ్వరని అర్దం చేసుకున్న ఆమె...సినిమాలు ఇక చెయ్యనని, అద్బుతమైన కథ వస్తే ఆలోచిస్తాను అంటోంది.

కుటుంబానికి తానివ్వబోయే ప్రాధాన్యతను వివాహానికి ముందే చెబుతోంది నటి అమలాపాల్‌. కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్లలో ఒకరైన ఆమె... దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ను వివాహమాడనుంది. జూన్‌ 7న కొచ్చిలో నిశ్చితార్థం, 13న చెన్నైలో పెళ్లి జరగనున్నాయి. వివాహం నిశ్చయమైనప్పటికీ అమలాపాల్‌ కోలీవుడ్‌, టాలీవుడ్‌లో ఆదరణ ఉన్న నటిగానే కొనసాగుతోంది. కొత్త అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఎన్ని అవకాశాలొచ్చినా.. పెళ్లి తర్వాత సినిమాలకు మాత్రం దూరంగానే ఉంటానంటోంది.

Amala Paul to quit working in films ?

అమలాపాల్ మాట్లాడుతూ.. ''పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటించాలనే ఆలోచన లేదు. కుటుంబానికే నా ప్రాధాన్యత ఉంటుంది. ఓ వేళ ఏదైనా అద్భుతమైన కథ లభిస్తే నటించటం గురించి అప్పుడు ఆలోచిస్తా. ప్రస్తుతానికి 'మిలి' అనే ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నా. మరోవైపు పెళ్లి ఏర్పాట్లూ చురుగ్గా సాగుతున్నాయి'' అని పేర్కొంది.

ప్రేమఖైదీ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కోచ్చి సుందరి అమలాపాల్‌. ఆ చిత్రంలో ఓ గ్రామీణ యువతి పాత్రలో సహజసిద్ధంగా నటించి మెప్పించింది ఈ సుందరి. ఈ సినిమా విడుదలకు ముందే నాగచైతన్యతో 'బెజవాడ'లో నటించే అవకాశం సైతం దక్కించుకుందీ భామ. ఇతర కథానాయకల్లా గ్లామరస్‌ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారమున్న స్క్రిప్టులను ఎంపికచేసుకుని తెలివిగా ముందడుగేస్తోందీ సుందరి.

తొలిచిత్రంతోనే జాతీయ అవార్డ్‌ అందుకోవడమే గాకుండా ప్రతిష్ఠాత్మక ఫిలింఫేర్‌కు కూడా నామినేట్‌ అయ్యింది. ఇటీవల 'దైవ తిరుమగల్‌'తో తమిళంలో విజయాన్ని నమోదుచేసుకుంది. అదే సినిమా తెలుగులో 'నాన్న'గా విడుదలై ..ఇక్కడా గుర్తింపును పెంచింది. ఇద్దరమ్మాయిలతోనూ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత చేసిన నాయిక్ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X