రాజశేఖర్‌తో అమలాపాల్ రొమాన్స్! ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ న్యూస్

సీనియర్ హీరో రాజశేఖర్‌తో అమలాపాల్ వెండితెర రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోందట. ఇదే జరిగితే ఈ ఇద్దరూ కలిసి నటించడం తొలిసారి అవుతుంది. ప్రస్తుతం ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి రూపంలో ప్రేక్షకులను పలకరించిన రాజశేఖర్ మరో కొత్త సినిమా కోసం సిద్ధమవుతున్నారు.

ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో అక్టోబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారు. అయితే ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే అమలాపాల్ తో సంప్రదింపులు జరిగాయని అందుకు అమలాపాల్ కూడా ఓకే చెప్పేసిందని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే వీరిద్దరి కాంబినేషన్‌లో ఇదే తొలి సినిమా కానుంది.

Amala Paul Ready to Romance with Dr. Rajasekhar..?

చాలా రోజులుగా అమలాపాల్ తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటోంది. ఈ సినిమాలో అమలాపాల్ నటిస్తే ఒకరకంగా ఆమెకిది టాలీవుడ్‌లో రీ ఎంట్రీ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇక రీసెంట్‌గా అమలాపాల్ నటించిన 'ఆమె' సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, తమిళనాట ప్రశంసలు అందుకుంది. కాబట్టి ఇప్పుడు రాజశేఖర్ సినిమాలో అమలాపాల్ క్రేజ్ క్యాచ్ చేసుకునేలా బలమైన పాత్ర డిజైన్ చేశారనేది టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X