ఆస్కార్ సినిమా తీస్తున్నారా ఏంటి..ఆపండి

వివరాల్లోకి వెళితే... హవీశ్ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్, కిరణ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా అమలాపాల్ ఎంపిక చేసారు. అయితే ఆమెకు పెళ్లై పోతే తమ ప్రాజెక్టుకి సమస్య వస్తుందని భావిస్తున్నారు. వివాహిత నటించిందని తెలిస్తే..లవ్ స్టోరీ పండదని భావిస్తున్నట్లు సమాచారం. ఈ పెళ్లి విషయం ముందే తమకు తెలిస్తే తాము జాగ్రత్తపడుదుమని వాపోతున్నట్లు తెలుస్తోంది. తాము అందరిలా తమ హీరోయిన్ వివాహం...అందరితో పాటు మీడియా ద్వారా తెలిసికోవాల్సి వచ్చిందని, ఇలా అమలాపాల్ తమకు దెబ్బకొట్టిందని, శ్రేయాభిలాషుల వద్ద నిర్మాతలు బాధపడినట్లు తెలుస్తోంది.
దక్షిణాది హీరోయిన్ అమలాపాల్, తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌ల నిశ్చితార్థం శనివారం కోచ్చిలోని ఓ చర్చిలో వైభవంగా జరిగింది. కాబోయే వధూవరులు ఒకరికొకరు ఉంగరాలు మార్చుకొన్నారు. తెల్లటి గౌనులో అమలాపాల్ మెరిసిపోయింది. పరిమిత సంఖ్యలో స్నేహితులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.
ఈ నెల 12న చెన్నైలో మేయర్ రామనాథన్ చెట్టియార్ హాల్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరుగుతుంది. దీనికి సంబంధించి అప్పుడే చెన్నైలో ఏర్పాట్లు వేగిరం చేశారు. దక్షిణాది చిత్రపరిశ్రమకు సంబంధించిన పలువురు సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరు కానున్నారు.
'మైనా' సుందరి అమలాపాల్, తమిళ దర్శకుడు విజయ్ ...ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో ఎవరినీ నొప్పించకుండా క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఎంగేజ్‌మెంట్ చేసుకుని, హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











