భర్తతో గొడవ పడిన హీరోయిన్ అమల పాల్

By Bojja Kumar

హైదరాబాద్: హీరోయిన్ అమలా పాల్ ఇటీవలే తమిళ దర్శకుడు విజయ్ ని మతాంతర వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అమలా పాల్ మళయాలీ క్రిస్టియన్ అయితే, విజయ్ తమిళ హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి. విజయ్ ఫ్యామిలీలో నాన్ వెజ్ తినే అలవాటు లేదట. అయితే అమలా పాల్‌కు మాత్రం నాన్ వెజ్ అంటే ప్రాణం.

ఇటీవల ఈ విషయంలో ఇద్దరి మధ్య చిన్న పాటి వాదన జరిగినట్లు తెలుస్తోంది. నాన్ వెజ్ మానేయాలని విజయ్ కోరగా....అమలా పాల్ తన వల్ల కాదని వాదించిందట. భార్యా భర్తలు అన్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న గిల్లిగజ్జాలు సహజమే. అయినా వాళ్ల తిండి గొడవ మనకెందుకు లెండి!

Amala Paul turns vegetarian

భర్త సహకారం ఉండటంతో అమలా పాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతోంది. మరో వైపు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ చేతి నిండా సంపాదిస్తోంది. మలయాళ చిత్రం ‘మిల్లీ'తో పెళ్లి తర్వాత వెండితెరపై సరికొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రాజేష్ పిళ్లై దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్ డీగ్లామర్ పాత్రను పోషించనుంది. పాత్రలో సహజత్వం కోసం మేకప్ లేకుండా ఈ చిత్రంలో నటించింది.

సినిమా కథాంశం విషయానికొస్తే....అందవిహీనంగా ఉన్నాననే భావనతో అసంతృప్తికరమైన జీవనాన్ని కొనసాగిస్తున్న ఓ మధ్యతరగతి యువతి ఎలా అందాలరాణిగా మారింది? తన జీవితాన్ని ఏ విధంగా ఆనందమయం చేసుకుంది? అనేది మెయిన్ స్టోరీ. ఇందులో ఆమెు పాత్ర విభిన్నంగా, ఆదర్శవంతంగా ఉంటుందని అంటున్నారు.

పెళ్లి తర్వాత సినిమాలకు కొంత విరామం ప్రకటించింది అమలాపాల్. ఆమె నటించిన చివరి సినిమా వేలైఇల్లా పట్టాధారి విడుదలై దాదాపు ఆరు నెలలయింది. దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిందనే అంతా అనుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X