SSMB28: ఏపీ రాజధాని పేరుతో మహేశ్ మూవీ టైటిల్.. ఊహించనిదే ఫిక్స్ చేసిన త్రివిక్రమ్
ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ ఉత్సాహంతోనే అతడు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోన్నాడు. ఇలా ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్నాడు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా టైటిల్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతోన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై మరో అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!

త్రివిక్రమ్‌తో మహేశ్ మూవీ
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ సినిమాను చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు.

ఆటంకాలే.. షూటింగ్ ఇలా
'అతడు', 'ఖలేజా' వంటి డీసెంట్ మూవీల తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. ఆ వెంటనే మొదటి షెడ్యూల్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేశారు. తర్వాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగానే జరుపుతున్నారు.

రిలీజ్ వాయిదా వేసినట్లేనా
క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, షూటింగ్ సజావుగా సాగని కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఇటీవలే చిరంజీవి 'భోళా శంకర్' మూవీ కూడా అదే రోజున విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మహేశ్ సినిమా వాయిదా పడడం నిజమేనని టాక్.

అప్‌డేట్... టైటిల్ పోస్టరే
కొద్ది రోజుల క్రితమే ఈ చిత్ర యూనిట్ ట్విట్టర్‌లో 'హేయ్ సూపర్ ఫ్యాన్స్.. SSMB28 కోసం మీ ఉత్సాహాన్ని, నిరీక్షణను అర్థం చేసుకున్నాము. సూపర్ స్టార్ నుంచి వచ్చే మాస్ విందు మీ నిరీక్షణ కంటే విలువైనదని హామీ ఇస్తున్నాము. సరైన సమయంలో అనౌన్స్‌మెంట్ రాబోతుంది. దీనిపై కన్నేసి ఉంచండి' అని ప్రకటించింది. దీంతో ఇది టైటిల్ పోస్టర్ అని అనుకుంటున్నారంతా.

ఎన్నో టైటిళ్లు.. చర్చలు
సూపర్ హిట్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమా కోసం 'అర్జునుడు', 'అతడే పార్థు', 'అమ్మ కోసం', 'అయోధ్యలో అర్జునుడు' వంటి టైటిళ్లను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే దీనిపై ఎన్నో రకాల చర్చలు జరుగుతోన్నాయి. దీంతో ఇలా కూడా ఈ మూవీ ట్రెండ్ అవుతోంది.

రాజధాని పేరుతో టైటిల్
మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారన్న దానిపై ఎన్నో రకాల వాదనలు వినిపిస్తోన్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీకి 'అమరావతికి అటు ఇటు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలిసింది. మార్చి 30వ తేదీనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని టాక్.


Click it and Unblock the Notifications











