Pushpa on Amazon: కళ్లు చెదిరే ధరకు పుష్ప ఓటీటీ రైట్స్.. అమెజాన్ ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని ప్రత్యేకమైన కాంబినేషన్లు ఉన్నాయి. అలాంటి కలయికల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. లెక్కల మాస్టారు సుకుమార్ జోడీ ఒకటి. గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన 'ఆర్య', 'ఆర్య 2' చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత వీళ్లిద్దరూ కలిసి 'పుష్ప' అనే సినిమాను చేశారు.

పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లోనూ భారీ స్పందన రావడంతో సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

పుష్పగా సందడి చేసి ఐకాన్ స్టార్

పుష్పగా సందడి చేసి ఐకాన్ స్టార్

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ మూవీనే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. సునీల్, అనసూయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్స్ చేశారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.

ఇక్కడే కాదు.. అక్కడా విజయమే

ఇక్కడే కాదు.. అక్కడా విజయమే

అదిరిపోయే కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కింది. ఇలా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా ఊహించని రీతిలో కలెక్షన్లను కొల్లగొడుతూ రికార్డులు క్రియేట్ చేసింది.

టార్గెట్ ఫినీష్.. లాభం ఎంతంటే

టార్గెట్ ఫినీష్.. లాభం ఎంతంటే

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 20 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 160.77 కోట్లు వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 14.77 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుంది.

ఓటీటీలో విడుదలకు పుష్ప రెడీ

ఓటీటీలో విడుదలకు పుష్ప రెడీ

అల్లు అర్జున్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'పుష్ప' మూవీ థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 7 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

కళ్లు చెదిరే ధరకు డిజిటల్ రైట్స్

కళ్లు చెదిరే ధరకు డిజిటల్ రైట్స్

థియేటర్లలో తెగ సందడి చేస్తోన్న 'పుష్ప' మూవీని అమెజాన్ సంస్థ జనవరి 7, రాత్రి 8 గంటల నుంచి స్ట్రీమింగ్ చేయబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ డిజిటల్ హక్కుల డీల్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. అమెజాన్ సంస్థ ఈ రైట్స్‌ను రూ. 22 కోట్లకు సొంతం చేసుకుందట. ఇది రికార్డు స్థాయి ధర అని ఫిలిం నగర్ ఏరియాలో చర్చించుకుంటున్నారు.

నాలుగింటికా? ఐదు భాషల్లోనా?

నాలుగింటికా? ఐదు భాషల్లోనా?

అల్లు అర్జున్ 'పుష్ప' మూవీని జనవరి 7 నుంచి స్ట్రీమింగ్ చేస్తారని ముందే చెప్పుకున్నాం. అయితే, దీన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మాత్రమే ఆరోజు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. హిందీ వెర్షన్‌ను మాత్రం ఇప్పుడే వదలడం లేదు. దీంతో అమెజాన్ రూ. 22 కోట్లు పెట్టింది నాలుగు భాషలకా? లేక హిందీతో కలిపేనా? అన్నది సస్పెన్స్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X