twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమీర్ ఖాన్ 1000 కోట్ల ప్రాజెక్ట్ క్యాన్సిల్.. రాజమౌళికి లైన్ క్లియర్!

    |

    దాదాపు ఇండియాలో ఉన్న బిగ్ స్టార్స్ అందరి కోరుకునేది ఒకటే.. లైఫ్ లో అందరికి గుర్తుండిపోయేలా హిస్టారికల్ సినిమాలు చేయాలని అనుకుంటారు. ముఖ్యంగా పౌరాణిక కథలపై కొందరు అగ్ర హీరోలు దర్శకులు చాలా కాలంగా చర్చలు జరుపుతున్నారు గాని వర్కౌట్ కావడం లేదు. అలాంటి కథల్లో మహాభారతం ఒకటి. దర్శకుడు రాజమౌళి అలాగే అమీర్ ఖాన్ వంటి వారు ఆ మహాసముద్రం లాంటి కాన్సెప్ట్ పై చాలా సార్లు స్పందించారు. అయితే ఈ విషయంలో అమీర్ ఖాన్ కారణంగా రాజమౌళికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

     జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్

    జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్

    దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఈ బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమా తరువాత జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరొక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఈ దర్శకుడు ఎన్ని బిగ్ బడ్జెట్ సినిమాలు తీసినా కూడా తన డ్రీమ్ ప్రాజెక్టు మాత్రం మహాభారతం అనే చెబుతాడు.

    అమీర్ ఖాన్ కలల ప్రాజెక్ట్ కూడా అదే

    అమీర్ ఖాన్ కలల ప్రాజెక్ట్ కూడా అదే

    తప్పకుండా ఆ సినిమా చేస్తాడని ఆడియెన్స్ లో ఒక నమ్మకం అయితే ఉంది.ఇక ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా కథను రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మహాభారతం కథతో వెబ్ సిరీస్ ని ప్లాన్ చేయాలని అమీర్ ఖాన్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. గత కొంత కాలంగా బ్యాక్ గ్రౌండ్ లో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    అందుకోసం బాహుబలి రైటర్

    అందుకోసం బాహుబలి రైటర్

    గతంలో ఇచ్చిన చాలా ఇంటర్వ్యూలలో కూడా అమీర్ ఖాన్ మహాభారతం వెబ్ సిరీస్ ఉంటుందని చెప్పాడు. దాదాపు 1000కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే అర్ధమయ్యిందట. ఇక స్క్రిప్ట్ పనుల కోసం అమీర్ ఖాన్ బహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ సహాయం కూడా తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. అందుకు ఆయన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు కథనాలు చాలానే వచ్చాయి.

    అంత ఈజీ కాదు.

    అంత ఈజీ కాదు.

    అయితే మరోవైపు విజయేంద్ర ప్రసాద్ లేకపోతే రాజమౌళి తన కలల ప్రాజెక్టును పూర్తి చేయడం అంత ఈజీ కాదు. ఆయననే కథను సెట్ చేయాల్సి ఉంటుంది. ఇక అందరికి తెలిసిన కథను రెండు వెర్షన్స్ లలో విజయేంద్ర ప్రసాద్ రాయగలరా అనేది కూడా మరొక సస్పెన్స్. మరి ఈ ప్రాజెక్టును ముందు ఎవరు తెరకెక్కిస్తారనే సందేహం కలుగుతున్న సమయంలో మరొక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

    అలా అయితే.. లైన్ క్లియర్ అయినట్లే

    అలా అయితే.. లైన్ క్లియర్ అయినట్లే

    అమీర్ ఖాన్ మహాభారతం కాన్సెప్ట్ నుంచి డ్రాప్ అయినట్లు బాలీవుడ్ మీడియాలో రూమర్లు గట్టిగానే వస్తున్నాయి. ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదని మిస్టర్ పర్ఫెక్ట్ ఆశలు వదులుకున్నట్లు సమాచారం. ఇక అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో మహాభారతం కథను తెరకెక్కిస్తే అది వరల్డ్ వైడ్ గా పాపులర్ అవ్వడం పక్కా. ఇక ఆ తరువాత రాజమౌళి ఎంత కొత్తగా ప్రజెంట్ చేసినా కూడా ముందు అమీర్ ఖాన్ తీసేసాడు కదా అనే కామెంట్ రాకుండా ఉండదు. అందుకే ఒక విధంగా అమీర్ డ్రాప్ అయితే జక్కన్నకు మహాభారతంను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించేందుకు లైన్ క్లియర్ అవుతుందని చెప్పవచ్చు.

    English summary
    Vijayendra Prasad is gearing up to direct his next film. Apparently, the star writer has roped in a young hero as the main lead in his next directorial. An official announcement is awaited in this regard. Ardhangi, Srikrishna, Rajanna and Sri Valli are the films directed by Vijayendra Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X