బిగ్ బి పై రహస్య కెమెరా?
మిడ్ డే పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అభిజిత్ మజుందార్‌పై బిగ్ బి అమితాబ్ తీవ్రంగా మండిపడ్డారు. తన 67వ జన్మదినం సందర్భంగా తీసుకున్న ఇంటర్వ్యూను మజుందార్ తనకు తెలియకుండా వీడియో తీసి వెబ్ సైట్‌లో పెట్టారంటూ ఆగ్రహించారు. తొలుత ఈమెయిల్ ఇంటర్వ్యూకే అంగీకరించినా, తర్వాత ముఖాముఖి ఇంటర్వ్యూకు సరేనన్నారు.
అయితే, ఆ ఇంటర్వ్యూ వీడియో తర్వాత వెబ్ సైట్‌లో దర్శనమివ్వడంతో అమితాబ్ తీవ్రంగా ఆగ్రహించారు. 'వాళ్లు అసలు అలాంటి వెబ్ సైట్ ఉందనే చెప్పలేదు. ఆయన ఓ 'స్టింగ్' కెమెరాను పెట్టి, నా అనుమతి లేకుండా వీడియో తీశారు' అని తన తాజా బ్లాగ్‌లో అమితాబ్ రాశారు. అయితే, వీడియో తీయబోతున్నట్లు ముందుగానే చెప్పానని మజుందార్ అంటున్నారు. తమలో ఎవరో ఒకరు అబద్ధం చెబుతున్నారని, లేదంటే అమితాబ్ జ్ఞాపకశక్తి సరిగా ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు.
బిగ్ బి అమితాబ్ మిడ్ డే ఇంటర్వ్యూ రహస్య వీడియో వెబ్ సైట్ big b amitabh bachchan mid day interview sting operation


Click it and Unblock the Notifications