twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్సీ లేడీతో కోల్డ్‌వార్‌కి బిగ్ బి ముగింపు

    By Bojja Kumar
    |

    ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ దర్శకత్వంలో 'హీరోయిన్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. వాస్త వానికి తొలుత ఈచిత్రం ఐశ్వర్య రాయ్ తో కమిట్ అయిన మధుర్....ఆమె గర్బం దాల్చడంతో కరీనాను ఎంపిక చేసుకున్నాడు. ఈ పరిణామాలు బచ్చన్లకు కరీనాకు మధ్య కోల్డ్ వార్‌కు దారి తీసాయనే వార్తలు వినిపించాయి.

    అయితే ఈ కోల్డ్ వార్‌కి అమితాబ్ బచ్చన్ ముగింపు పలకడానికి సిద్దం అయ్యారట. సెప్టెంబర్ 21 కరీనా బర్త్ డే సందర్భంగా ఆమెను 'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమానికి ఇన్వైట్ చేసాడని, అదే రోజు విడుదలవుతున్న హీరోయిన్ సినిమా విజయవంతం కావాలని అమితాబ్ శుభాకాంక్షలు తెలుపనున్నాడని తెలుస్తోంది.

    బార్ గర్ల్స్, మోడల్స్ జీవితాలు తెర వెనక ఎలా ఉంటాయి అని తన గత చిత్రాలో కళ్లకు కట్టినట్లు చూపించిన మధుర్...ఈ సారి హీరోయిన్ల జీవితాల్ని 'హీరోయిన్' చిత్రంలో ఆవిష్కరించనున్నారు. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కింది స్థాయి నుంచి వచ్చిన హీరోయిన్ల జీవితం ఎలా ఉంటుంది, వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి? అనే అంశాన్ని బేస్ చేసుకుని ఈచిత్రాన్ని నిర్మించారు.

    సెప్టెంబర్ 21వ తేదీన ఈచిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రోనీ, మాధుర్ బండార్క్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి దాదాపు రూ. 18 కోట్లు ఖర్చు పెట్టారు. గతంలో మాధర్ దర్శకత్వంలో వచ్చిన చాందినీ బార్, ఫ్యాషన్, పేజ్ త్రీ, ట్రాఫిక్ సిగ్నల్ చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చింది. పైగా కరీనా కపూర్ హీరోయిన్ కావడంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    English summary
    
 Everyone knows that Aishwarya Rai Bachchan had signed Madhur Bhandarkar's Heroine before Kareena Kapoor. But after the news of her pregnancy, Madhur replaced her with Kareena. This led to a cold war between Bachchan's and Kareena Kapoor. But now, Amitabh Bachchan has ended the war by wishing Kareena luck for Heroine, on his show Kaun Banega Crorepati.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X