RC16: రామ్ చరణ్ సినిమాలో మెగాస్టార్.. ఊహించని పాత్రలో టాప్ హీరో.. ఇది కూడా మల్టీస్టారరేనా!
తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోల రేంజ్ ఇప్పుడు క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇలా ఇప్పటికే చాలా మంది పాన్ ఇండియా స్టార్లుగా మారారు. అందులోనూ కొందరు గ్లోబల్ రేంజ్‌కు ఎదిగిపోయారు. వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. RRR తర్వాత గ్లోబల్ స్టార్ అయిన అతడు.. ఇప్పుడు వరుసగా మూవీలు చేస్తున్నాడు. అందులో బుచ్చిబాబు సనతో క్రేజీ ప్రాజెక్టు కూడా ఉంది. ఈ చిత్రంలో మెగాస్టార్ కూడా నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!
గేమ్ చేంజర్‌గా మారాడు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. దీన్ని వచ్చే అక్టోబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

బుచ్చిబాబుతో సినిమా
రామ్ చరణ్ తన 16వ సినిమాను 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సనతో చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రకటన చాలా రోజుల క్రితమే వెలువడింది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. దీనికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది.
పూజ పూర్తి చేసేశారుగా
పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమాలను బుచ్చిబాబు సన వేగంగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా ఇప్పటికే బాండెడ్ స్క్రిప్టును రెడీ చేయడంతో పాటు మిగిలిన అన్నింటినీ సెట్ చేసేశాడు. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇక, త్వరలోనే షూటింగ్‌ను సైతం ప్రారంభించబోతున్నారు.

అలాంటి బ్యాగ్‌డ్రాప్‌తో
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన రూపొందించే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని ఇప్పటికే సమాచారం లీక్ అయింది. అంతేకాదు, ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నాడని, రన్నర్‌గా చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. మొత్తానికి ఈ సినిమా మాత్రం ఓ క్రీడాకారుడి కథతోనే రాబోతుందని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్లతో
హై రేంజ్ కాన్సెప్టుతో రాబోయే ఈ సినిమాలో ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్లు భాగం కాబోతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే, ఇందులో విలన్‌గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ను తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఓ ముఖ్యమైన పాత్ర కోసం కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్‌ను కూడా ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే.

చరణ్ మూవీలో బిగ్‌బీ
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంలో ఇప్పటికే ఎంతో మంది బడా స్టార్లు భాగం అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇందులో రామ్ చరణ్ తాత పాత్ర కోసం మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను తీసుకున్నారని తెలిసింది. ఆయనకు ఇప్పటికే బుచ్చిబాబు స్టోరీని వినిపించగా.. వెంటనే ఓకే చేశారట. త్వరలోనే దీన్ని రివీల్ చేస్తారని సమాచారం.


Click it and Unblock the Notifications











