అమితాబ్ బచ్చన్ చనిపోయారంటూ...?
బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కారుకు యాక్సిడెంట్ అయి ఆయన మరణించారంటూ బ్లాగుల్లో పుకార్లు గుప్పుమన్నాయి. 24musicvdo.blogspot.in, http://24musicvdo.blogspot.in/2012/06/amitabh-bachan-died-in-single-vehicle.html బ్లాగులో ఈ వార్త వెలువడింది. ఇందులో యాక్సిడెంట్ అయిన కారు ఫోటోను కూడా పెట్టారు.
ఇది కాస్తా సోషల్ మీడియా ద్వారా ప్రపంచం అంతా వ్యాపించింది. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇదంతా ఫాల్స్ న్యూస్ అని తేలింది. బిగ్ బి వ్యవహారాలు చూసే పిఆర్‌ఓ ఈ వార్తను ఖండించారు. ఆయన ఇంట్లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. బ్లాగర్స్, మొబైల్ మీడియా ఇలాంటి వార్తలు కావాలని పుట్టిస్తోంది తెలుస్తోంది. ఆ మధ్య లతా మంగేష్కర్, రాజేస్ ఖన్నాలపై కూడా ఇలాంటి వార్తలే చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.
అమితాబ్ సినీ జీవితం విషయానికొస్తే... 'బిగ్ బి అమితాబ్' 'ది గ్రేట్ గాట్స్‌బై' అనే చిత్రం ద్వారా హాలీవుడ్‌కి పరియమవుతున్నారు. ఆ సినిమాలో అమితాబ్ యూదు డబ్బు ఇచ్చేవాడిగా(మనీ లెండర్) పాత్రను పోషించారు. ఈ పాత్ర పేరు మేయర్ వోల్ఫిషిమ్. ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌లో అమితాబ్ రెండు సార్లు కనిపించనున్నారు.
ఈ సినిమాలో అమితాబ్‌తో పాటు టైటానిక్ సూపర్ హీరో లియోనార్డో డికాప్రియో మరియు సూపర్ మ్యాన్ సిరిస్‌ల ద్వారా ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్న తోబే మాగ్యూర్ నటిస్తున్నారు. ఈ సినిమాని స్కాట్ ఫిట్జ్ర్అల్డ్ రచించిన 'ది గ్రేట్ గాట్స్‌బై' నవల ఆధారంగా తెరకెక్కించారు. దర్శకత్వం: బాజ్ లూహుర్మాన్, స్క్రీన్ ప్లే: బాజ్ లూహుర్మాన్, గ్రేగ్ పీయర్స్.


Click it and Unblock the Notifications











