అరవింద సమేతలో అమితాబ్.. రంగంలోకి ఎన్టీఆర్.. సీక్రెట్‌గా..
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న అరవింద సమేత చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దమ్ము తర్వాత ఫ్యాక్షన్ తరహా చిత్రంలో ఎన్టీఆర్ నటించడం ఇదే మొదటిసారి. ఇటీవల విడుదలైన టీజర్ ఈ చిత్రంపై మరింత హైప్‌ను పెంచింది. తాజాగా ఈ చిత్రంలో అమితాబ్ నటిస్తున్నారనే వార్త వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..

ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం
ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలకు ధీటుగా రూపొందిస్తున్న అరవింద సమేత చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను సెప్టెంబర్ రెండోవారం నుంచి వేగవంతం చేయనున్నారనేది చిత్ర యూనిట్ సమాచారం.

పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీ బిజీగా
అరవింద సమేత సినిమా షూటింగ్ ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సోమవారం నుంచి సినిమా ప్రమోషన్‌ను జోరుగా ప్రారంభించాలని నిర్ణయించారు అని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్లను, ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను ఒక్కొక్కటి మీడియాకు వెల్లడించనున్నట్టు సమాచారం.

అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో
అరవింద సమేతలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబచ్చన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ చిత్రంలో అతిథి పాత్రలో బిగ్‌బీ కనిపించనున్నట్టు తెలిసింది. అయితే పాత్రకు సంబంధించిన వివరాలను చాలా సీక్రెట్‌గా పెట్టినట్టు సమాచారం.

సైరాలో బిగ్‌బీ అమితాబ్
మెగాస్టార్ చిరంజీవితో మెగాపవర్‌స్టార్ రాంచరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సైరా నర్సింహారెడ్డి చిత్రంలో ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సమరయోధుడు నర్సింహారెడ్డికి గురువుగా బిగ్‌బీ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో రూపొందించనున్నారు.

అక్టోబర్ 11న విడుదల
అక్టోబర్ 11న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రంలో ఇషా రెబ్బా, జగపతిబాబు, నాగబాబు, సునీల్, రావు రమేష్, రవి ప్రకాశ్, సితారా తదితరులు నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్, పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్‌పై రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











