ప్రభాస్ సినిమా కోసం అమితాబ్ బచ్చన్ కి భారీ రెమ్యునరేషన్.. ఆ పాత్ర ఎలా ఉంటుందంటే..?

ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలో ఒకటైన ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ సినిమా అభిమానుల ముందుకు ఎప్పుడు వస్తుందో తెలియదు గాని సినిమాకు సంబంధించిన తెర వెనుక స్టోరీలు మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా అగ్రతారాలు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

తగిన న్యాయం చేశారనే చెప్పాలి.

తగిన న్యాయం చేశారనే చెప్పాలి.

ఈ సినిమా తెరపైకి రావడానికి ఇంకా సమయం చాలానే ఉన్నప్పటికీ అప్డేట్స్ తో మాత్రం చిత్ర యూనిట్ ఊహించని విధంగా అంచనాలను పెంచేస్తోంది. ఇటీవల అనుకున్నట్లుగానే అమితాబ్ బచ్చన్ కి సంబంధించిన అప్డేట్ తో కిక్కిచ్చే సర్ ప్రైజ్ ఇచ్చారు. సినిమాలో మరో యాక్టర్ నటించబోతున్నాడని గత కొంత కాలంగా వస్తున్న రూమర్స్ కి తగిన న్యాయం చేశారనే చెప్పాలి.

కథలో పూర్తిగా కనిపిస్తాడట

కథలో పూర్తిగా కనిపిస్తాడట

భారత దేశ సినీ హిస్టారిలో లెజెండ్ గా ఎంతగానో క్రేజ్ అందుకున్న నటుడు అమితాబ్ బచ్చన్ ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించనోతున్నాడు అనే విషయం ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. మొదట్లో ఆయన ఒక అతిథి పాత్ర కోసమే ఒప్పుకున్నట్లు టాక్ వచ్చింది. కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ అమితాబ్ కథలో పూర్తిగా ఉంటాడని చెప్పడంతో సినిమా స్థాయి మరో లెవెల్ కి చేరింది.

 అమితాబ్ బచ్చన్ పాత్ర ఎలా ఉంటుందంటే..

అమితాబ్ బచ్చన్ పాత్ర ఎలా ఉంటుందంటే..

ఇప్పటికే హీరోయిన్ గా దీపిక పదుకోన్ ని ఫిక్స్ చేసుకున్న చిత్ర యూనిట్ భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ని కూడా ఫిక్స్ చేసుకోవడంతో అంచనాల డోస్ మరింత పెరిగాయి. సినిమాలో ఆయన ఒక శాస్త్రవేత్తగా కనిపిస్తారట. కథతో అమితాబ్ మొదలవుతుందట. టైమ్ ట్రావెలింగ్ పైనే పరిశోధనలు చేసే ఒక అద్భుతమైన శాస్త్రవేత్తగా కథ ఏండింగ్ వరకు కనిపిస్తారని తెలుస్తోంది.

అమితాబ్ రెమ్యునరేషన్ ఎంతంటే..

అమితాబ్ రెమ్యునరేషన్ ఎంతంటే..

ఇక ఈ అగ్ర నటుడి రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 25కోట్ల వరకు డీలింగ్ సెట్ చేసుకున్నట్లు రూమర్స్ అయితే గట్టిగా వస్తున్నాయి. బాలీవుడ్ లో అమితాబ్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ప్రభాస్ బాహుబలి, సాహూ సినిమాలతో అక్కడ తన మార్కెట్ ని పెంచుకున్నాడు. ఇక ఇప్పుడు వీరి కలయికతో ఈ సినిమా మార్కెట్ ని మరింత పెంచడానికి సిద్ధమవుతున్నారు.

అక్టోబర్ 23న మరొక గుడ్ న్యూస్..

అక్టోబర్ 23న మరొక గుడ్ న్యూస్..


ఇక ప్రభాస్ పుట్టినరోజున ఒక అప్డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు మొన్నటివరకు ఒక టాక్ వచ్చింది. ఇక ఇప్పుడే మంచి అప్డేట్ ఇవ్వడంతో అక్టోబర్ 23న మరొక గుడ్ న్యూస్ ఏదైనా చెబుతారా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా ప్రభాస్ కి బర్త్ డే విషెస్ అందించాలి కాబట్టి స్పెషల్ పోస్టర్ ఏమైనా విడుదల చేస్తారేమో అనే టాక్ నడుస్తోంది.

Recommended Video

Birthday Wishes For The Bollywood Legend From Tollywood Stars
సైన్స్ ఫిక్షన్ అని అప్పుడే అర్థమైంది

సైన్స్ ఫిక్షన్ అని అప్పుడే అర్థమైంది


ఇక ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాకు పూర్తి కథను సిద్ధం చేసుకున్న నాగ్ అశ్విన్ సినిమా మేకింగ్ లో సహాయం కోసం సింగీతం శ్రీనివాసరావును కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఇక అప్పుడే ఈ సినిమా టైమ్ ట్రావెలింగ్ నేపధ్యంలో తెరకెక్కుతుందని క్లారిటీ వచ్చేసింది. గతంలో సింగీతం బాలకృష్ణతో ఆదిత్య 369 సినిమాతో సరికొత్త వండర్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా మరో వండర్ క్రియేట్ చేస్తున్నాడు. మరి అలాంటి సినిమాలో అమితాబ్ బచ్చన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X