చిరు క్యారెక్టర్ ని అమితాబ్ చేస్తున్నారు
చిరంజీవి తెలుగులో చేసిన ఠాగూర్ చిత్రాన్ని హిందీలో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో చిరంజీవి చేసిన పాత్రను అమితాబ్ బచ్చన్ చేసే అవకాశం ఉందని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఎ.ఆర్.మురగదాస్ ఈ చిత్రం స్క్రిప్టుని హిందీకి అణుగుణంగా మార్చి రాస్తున్నారు. ఇక అమితాబ్ కూడా ఈ తరహా యాక్షన్ సినిమా చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ ని ఎంచుకోవటానికి కారణం అన్నా హజారే ని గుర్తు చేయటానికి అని చెప్తున్నారు.
జాతి మొత్తం ఇప్పుడు అన్నా హజారేని ప్రస్తుతిస్తున్న సమయంలో ఆయన ఆలోచనలు తెరపై చూపటం ద్వారా కొంత వరకూ ప్రేక్షకుల ఏక్సెప్టెన్స్ సాధించే అవకాశం ఉందని మురగదాస్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడాయన తమిళంలో విజయ్ తో సినిమా ఒప్పుకుని ఉన్నారు. ఆ సినిమా పూర్తి చేసి దీన్ని మొదలెట్టాలా అనే ఆలోచనలో మురగదాస్ ఉన్నారు. అలాగే తమిళంలో ఉన్న ట్రాజిక్ క్లైమాక్స్ నే హిందీలోనూ పెట్టాలని మురగదాస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పు వల్ల సినిమా మరింత ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే అమితాబ్ మొత్తం స్క్రిప్టు చదివి ఓకే చేస్తానని చెప్పటంతో ప్రస్తుతం మురగదాస్ ఆ పనిలో ఉన్నారు. మరో ప్రక్క అక్షయ్ కుమర్ తో కూడా మురగదాస్ కి కమిట్ మెంట్ ఉంది.


Click it and Unblock the Notifications











