సూపర్ స్టార్స్ ఇద్దరినీ ఒకే చిత్రంలో పూరి జగన్నాధ్

By Srikanya

అమితాబ్‌బచ్చన్, రజనీకాంత్ కలిపి ఓ చిత్రంలో నటింపచేయటానికి పూరీ జగన్నాధ్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ మేరకు ముంబై మిర్రర్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. గతంలో ఈ స్టార్స్ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో హమ్, గిరఫ్తార్, అంధా ఖానూన్ చిత్రాలు వచ్చి విజయవంతమయ్యాయి. దాదాపు పాతికేళ్ల తర్వాత వీరిద్దరని కలుపుతూ పూరీ ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ మేరకు పూరీ రీసెంట్ గా చెన్నైయ్ వెళ్లి రజనీని కలిసి ఓ కధ వినిపించాడని చెప్తున్నారప. వెంటనే రజనీ ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

పూరీ జగన్నాధ్ సైతం ఈ వార్తను కన్ఫర్మ్ చేస్తూ..అవను..నేను రజనీ సార్ ని చెన్నైలో కలిసాను. ఆయనతో కలిసి పనిచేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. అయితే ఆయనకు తగ్గ కథ నా దగ్గర లేకపోవటంతో ఇన్నాళ్లూ కలవలేదు. ఆయనతో కలిసిపనిచేయాలనేది నా లైఫ్ లాంగ్ డ్రీమ్. ఇది నాకో ఛాలెంజ్. వీరిద్దరితో సినిమా చేస్తాననే ఆశిస్తున్నాను. చూద్దాం ఏమౌతుందో అన్నారు.

ఇక గతంలో అమితాబ్ తో బుడ్డా చిత్రం చేసి ఉండటంతో ఆ పరిచయంతో అమితాబ్ డేట్స్ పట్టటుకునే పనిలో ఉన్నారు పూరీ. మహేష్ తో చేసిన బిజనెస్ మ్యాన్ చిత్రం సూపర్ హిట్ కావటంతో అందరి కన్నూ ఇప్పుడు పూరీ జగన్నాధ్ మీదే ఉంది. మరో ప్రక్కన పూరీ ..పవన్ కళ్యాణ్ తో చిత్రాన్ని మే నెల నుంచి ప్రారంభిస్తున్నారు. ఆ చిత్రం అనంతరం రవితేజతో దేముడు చేసిన మనుష్యులు చిత్రం రూపొందిస్తారు. వీటిన్నటి తర్వాత మహేష్ తో బిజినెస్ మ్యాన్ 2 రూపొందిస్తున్నారు. ఈ లోగా ఈ స్టార్స్ ఇద్దరి డేట్స్ ఎప్పుడు వీలైతాయో చూసుకుని స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసుకుని రంగంలోకి దిగుతాడంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X