వెంకటేష్ దెబ్బ కొట్టాడంటూ డైరక్టర్ గోల?
ఈ రోజే (బుధవారం)వెంకటేష్ కొత్త చిత్రం షాడో ఓపినింగ్ జరిగింది. ఈ చిత్రంలో వెంకటేష్ డాన్ గా కనిపించటనున్నాడని సమాచారం. అయితే ఇదే కథను తాను గంగ టైటిల్ తో వెంకటేష్ కోసం రెడీ చేసుకున్నానని అయితే ఇప్పుడు ఆ కథతో వేరే డైరక్టర్ సినిమా ప్రారంభించటం కష్టం గా ఉందని దర్శకుడు అమ్మ రాజశేఖర్ గోలెత్తుతున్నాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో నల్లమలుపు బుజ్జి నిర్మాతగా వెంకటేష్ హీరోగా గంగ..ది డాన్ టైటిల్ తో ఓ కథ రెడీ చేసారు. అయితే అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడదే కథతో వెంకటేష్, మెహర్ రమేష్ ల చిత్రం తెరకెక్కుతోందని అమ్మ రాజశేఖర్ అనుకుంటున్నారని బాధపడుతున్నారని చెప్పుకుంటున్నారు.
అయితే ఆ కథా,ఈ కథా ఒకటేనా కాదా అనేది మాత్రం ఎవరికి తెలియదు. వెంకటేష్ కు ఆ రైటర్స్ కు తప్ప. ఈ రెండు చిత్రాలకు కోన వెంకట్ రైటర్ గా వ్యవహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలోనూ డాన్ గెటప్ కావటంతో ఈ సందేహం వచ్చిందని చెప్తున్నారు. ఇక తను చేయాల్సిన ప్రాజెక్టు మరొకరు చేస్తే బాధ కలగటం సహజమే అని కొందరు అంటున్నారు. ఇక మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని స్టైలిష్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తానని చెప్తున్నారు. కోన వెంకట్,గోపీ మోహన్ కథ అందిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ మరో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. తాప్సీని హీరోయిన్ గా ఎంపిక చేసారు. ప్రస్తుతం అమ్మ రాజశేఖర్ చేతిలో చిత్రాలేవీ లేవు.


Click it and Unblock the Notifications











