రామ్ చరణ్ హీరోయిన్ సహజీవనం
ఇప్పుడు సహ జీవనం అనేది సినీ వర్గాల్లో కాలా కామన్ విషయం అయిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి దిగుమతి అయ్యే బ్యాచ్ లో మరి పెరిగిపోయింది. తాజాగా ఈ లిస్ట్ లో రామ్ చరణ్ హీరోయిన్ చేరింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఎవడు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఎంపికైన బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ తన బోయ్ ప్రెండ్ తో లివ్ ఇన్ రిలేషన్ లో గడుపుతున్నట్లు బాలీవుడ్ పత్రికలు రాసుకొచ్చాయి. బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ తో ఆమె కొంత కాలంగా ప్రేమలో ఉంది. ఆ రిలేషన్ నే ఇప్పుడు సహ జీవనంగా మార్చుకుని ఇద్దరూ కంటిన్యూ అవుతున్నట్లు చెప్తున్నారు.
ముంబై బాంద్రాలోని ఎమీ ఇంట్లోనే వీరిద్దరూ కాపురం పెట్టినట్లు చెప్తున్నారు. వీరిద్దరూ తెలుగులో హిట్టైన ఏమి మాయ చేసావే హిందీ రీమేక్ లో చేసారు. అప్పుడు ఒకరికి ఒకరు దగ్గరయ్యారు. బృందావనం ఫేం వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్ రచయితగా, చోటాకె నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. తొలి సారిగా చెర్రీ, బన్నీ కలిసి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బన్నీ నటించే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్ గా ఉంటాయంటున్నారు.


Click it and Unblock the Notifications











