Baby Movie Release Date: ఇదేంటి బేబీ.. మరీ ఇంత ఘాటుగానా.. ఆరోజే రిలీజ్

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు... ఆనంద్ దేవరకొండ దొరసాని చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడిస్, పుష్పక విమానం, హైవే అంటూ సినిమాలు చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆనంద్ తాజాగా బేబీ అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..

బేబీగా వస్తున్న ఆనంద్ దేవరకొండ: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బేబీ. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, పోస్టర్స్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్ కు మంచి స్పందన వస్తోంది. దానితో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతూ వస్తున్నాయి. ఇక ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రిలీజ్ కు సిద్దం అయింది.

Anand Devarakonda Movie Baby Release Date Fix and Movie Poster Released

70 అడుగుల విడుదల తేదీ పోస్టర్: హైదరాబాద్‍లోని ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద గురువారం నిర్వహించిన ఈవెంటు చిత్రబృందం రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఈ సినిమా జూలై 14వ తేదీన రిలీజ్ అవ్వనున్నట్లు ప్రకటించగా... ఇదే విషయాన్ని ప్రసాద్ ఐ-మాక్స్ దగ్గర దాదాపు 70 అడుగుల విడుదల తేదీ పోస్టర్ తో ప్రకటించారు. బేబి మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‍ గా నటిస్తోంది. విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. జాతీయ అవార్డు గెలిచిన కలర్ ఫొటో సినిమాకు కథ అందించిన సాయి రాజేశ్.. ఈ బేబీ సినిమాకు దర్శకుడిగా ఉన్నాడు.

Anand Devarakonda Movie Baby Release Date Fix and Movie Poster Released

ఈ సినిమా నుంచి మరో పోస్టర్: ఇక బేబీ నుంచి మరో పోస్టర్ రిలీజ్ కాగా.. వివాదాలకు దారితీస్తోంది. ఒక చెయ్యి మిడిల్ ఫింగర్ గా హీరోయిన్ వైష్ణవి చైతన్య ను చూపించారు. పింక్ కలర్ డ్రెస్ లో ఆమె నవ్వుతూ... కనిపించింది. అమ్మాయిని అలా మిడిల్ ఫింగర్ గా చూపించడమేంటిని కామెంట్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే...ఈ కథ ఏదో కొత్తగా ఉండేలా ఉందే అని కొంతమంది అనుకుంటున్నారు. ఇక పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు.

Anand Devarakonda Movie Baby Release Date Fix and Movie Poster Released

ట్రయాంగిల్ లవ్ స్టోరీగా బేబీ: ఈ వర్షాకాలంలో మంచి ప్రేమ కథగా ఈ చిత్రం వస్తోందని చిత్రబృందం తెలిపింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా బేబీ రానుందని తెలుస్తోంది. ఆనంద్, వైష్ణవి, విరాజ్ అశ్విన్ మధ్య ఈ ట్రయాంగిల్ ప్రేమ కథ నడుస్తుంది. డీగ్లామరస్ రోల్‍లోనూ వైష్ణవి నటించింది. ఫస్ట్ లుక్, టీజర్, లిరికల్ పాటలతో ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు విజయ్ బుల్గాన్ సంగీతం అందించాడు. డైరెక్టర్ మారుతీ, ఎస్‍కేఎన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా వస్తోంది.

Anand Devarakonda Movie Baby Release Date Fix and Movie Poster Released

వచ్చే వారంలో బేబీ ట్రైలర్: ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ లాంఛ్ కు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలతో పాటు ఈ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ అలానే ఈ సినిమా నిర్మాత ఎస్కేఎన్, కో ప్రొడ్యూసర్ ధీరజ్ అటెండ్ అయ్యారు. ఒక ఇంటెన్స్ లవ్ స్టొరీ తో అందరికీ నచ్చే అంశాలతో జూలై 14న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో... ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను వచ్చే వారం రిలీజ్ చేయనున్నారట. చిత్ర ప్రమోషన్స్ కూడా వేగవంత చేయనున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X