ఈవీవీ సత్యనారాయణ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేయనున్న దేవరకొండ

By Manoj

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ ఇటీవల కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించిన 'దొరసాని' ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయినప్పటికీ ఆనంద్ నటన పరంగా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. ఇందులో అతడి నటన విమర్శలకును సైతం ఆకట్టుకుంది. మొదటి సినిమానే అయినా.. మెచ్యూరిటీతో నటించాడని చాలా మంది కొనియాడారు. ఈ ఉత్సాహంతోనే అతడు రెండో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏంటా అప్‌డేట్..? వివరాల్లోకి వెళితే...

బడా సంస్థలో సినిమా

బడా సంస్థలో సినిమా

ఆనంద్ దేవరకొండ భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసింది. ఈ సినిమా ద్వారా వినోద్ అనే నూతన దర్శకుడు తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నాడని అన్నారు. దీనికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారికంగా షూటింగ్ ప్రారంభం కానుందని వార్తలు వచ్చాయి.

హీరోయిన్‌గా బొలమ్మ

హీరోయిన్‌గా బొలమ్మ

ఈ సినిమాలో ఆనంద్ సరసన వర్ష బొలమ్మ అనే హీరోయిన్ నటిస్తుందని కూడా జోరుగా ప్రచారం జరిగింది. ఈమె ప్రస్తుతం రాజ్ కందుకూరి కుమారుడు శివ చేస్తున్న సినిమాలో నటించింది. ఈ సినిమా విడుదల కాకముందే మరో అవకాశం పొందిందని అనుకున్నారు. దీంతో ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయం అనుకున్నారు.

ఆ సినిమా ఆగిపోయిందా.?

ఆ సినిమా ఆగిపోయిందా.?

భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ దేవరకొండ సినిమా ప్రారంభం అవుతుందని ఎప్పటి నుంచో వార్తలు వచ్చినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉండడం వల్లే షూటింగ్ ప్రారంభం కాలేదని కొందరు చెప్పుకొచ్చారు.

 హిట్ సినిమా రీమేక్

హిట్ సినిమా రీమేక్

ఆనంద్ దేవరకొండ చేసే రెండో సినిమాపై తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అతడు.. 1997లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘తాళి' అనే సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని తాజాగా ఓ వార్త ఫిలింనగర్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా మలచి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని టాక్.

Recommended Video

#CineBox : RRR Update : Olivia Morris Pairup With Jr. NTR In RRR Movie !
అనూహ్య స్పందన

అనూహ్య స్పందన

కామెడీ చిత్రాల దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘తాళి'లో శ్రీకాంత్, శ్వేత, స్నేహ, స్వాతి నటించారు. మాగంటి వెంకటేశ్వర్రావు నిర్మించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతం అందించారు. 1997లో విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి వరకు కామెడీ సినిమాలతో ఆకట్టుకున్న ఈవీవీ.. ఈ సినిమాతో మంచి పేరును దక్కించుకున్నారు. శ్రీకాంత్‌కు కూడా ఈ సినిమా ప్లస్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X