ఆనంద్ దేవరకొండ సరసన వర్ష.. ఈమె కొత్త నటి కాదు.. ఈ హీరోయిన్ గురించి తెలిస్తే..

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ ఇటీవల కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించిన 'దొరసాని' ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయినప్పటికీ ఆనంద్ నటన పరంగా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. ఇందులో అతడి నటన విమర్శలకును సైతం ఆకట్టుకుంది. మొదటి సినిమానే అయినా.. మెచ్యూరిటీతో నటించాడని చాలా మంది కొనియాడారు. ఈ ఉత్సాహంతోనే అతడు రెండో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఇందులో భాగంగానే ఆనంద్ దేవరకొండ భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా వినోద్ అనే నూతన దర్శకుడు తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నాడట. దీనికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారికంగా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆనంద్ రెండో సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

Anand Deverakonda Will Romance With Varsha Bollamma

ఈ సినిమాలో ఆనంద్ సరసన వర్ష బొలమ్మ అనే హీరోయిన్ నటిస్తుందట. ఇప్పటికే దీనికి సంబంధించని చర్చలు కూడా జరిగిపోయాయని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈమె ప్రస్తుతం రాజ్ కందుకూరి కుమారుడు శివ చేస్తున్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా విడుదల కాకముందే మరో అవకాశం పొందింది.

పేరుకు కర్నాటకకు చెందిన అమ్మాయే అయినా.. వర్ష కన్నడంలో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పటి వరకు తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. ఆ తర్వాత మలయాళంలో మూడు సినిమాల్లో కనిపించింది. ఈ సినిమాతో తెలుగులో రెండోది అవుతుంది. విశేషమేంటంటే.. అట్లీ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న 'బిజిల్' సినిమాలోనూ వర్ష నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X