తమ్ముడి కోసం విజయ్ దేవరకొండ ఇంత త్యాగం చేశాడా?

కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌, రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం 'దొరసాని'. దగ్గుబాటి సురేశ్‌బాబు సమర్పణలో మధుర శ్రీధర్‌, యశ్‌ రంగినేని నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. మొదటి సినిమానే అయినా హీరో హీరోయిన్ల నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే, కలెక్షన్ల పరంగానూ సినిమా చక్కని ఫలితాన్ని అందుకుంది. దీంతో చిత్ర బృందం సంతృప్తిగానే ఉంది.

రెండో సినిమా షురూ

రెండో సినిమా షురూ

‘దొరసాని' ఫలితంతో జోష్ మీద ఉన్న ఆనంద్ దేవరకొండ.. మరో సినిమాను పట్టాలెక్కించడానికి సిద్ధం అవుతున్నాడు. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా వినోద్ అనే నూతన దర్శకుడు తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నాడట. దీనికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారికంగా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

తమ్ముడి కోసం విజయ్ త్యాగం

తమ్ముడి కోసం విజయ్ త్యాగం

తొలి సినిమానే అయినా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న తన తమ్ముడి కోసం విజయ్ దేవరకొండ త్యాగం చేశాడన్న వార్త ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. దీని ప్రకారం.. మొదట ఈ సినిమా కథ విజయ్ దగ్గరకు వెళ్లిందట. చిత్ర దర్శకుడు వినోద్ చెప్పిన ఈ స్టోరీ అతడికి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేసేశాడని తెలిసింది. కానీ, తమ్ముడి కోసం దాన్ని వదులుకున్నాడని వినికిడి.

కథలో కొన్ని మార్పులు

కథలో కొన్ని మార్పులు

ఈ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ నిర్మాతలకు తేల్చి చెప్పేశాడట. అదే సమయంలో తన తమ్ముడు నటిస్తాడని కూడా వెల్లడించాడట. దీంతో దర్శకుడు ఈ స్టోరీలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్ స్థాయిలో హీరోయిజం పండించలేడనే కారణంతోనే ఈ మార్పులు చేయబోతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

‘దొరసాని'కి సహకరించకపోయినా..

‘దొరసాని'కి సహకరించకపోయినా..

ఆనంద్ దేవరకొండ చేసిన దొరసానికి తన సహకారం ఏమీ లేదని విజయ్ దేవరకొండ గతంలోనూ స్పష్టం చేశాడు. ఆ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దీనిపై క్లారిటీ కూడా ఇచ్చేశాడు. ‘‘యాక్టింగ్ అంటే మాట‌లు కాదు.. స‌డెన్‌గా వ‌చ్చి చేస్తానంటే ఎలా చేస్తావు. మ‌జాక్ అనుకున్నావా? అన్నాను. వాడు ఫిక్స్ అయిపోయున్నాడు కాబ‌ట్టి నేనేమీ చెప్ప‌లేదు. అయితే నీ సినిమా గురించి నన్నేమీ అడ‌క్కు అని అన్నాను. ఆరోజు నుండి నేను కూడా సినిమా గురించి ఏమీ మాట్లాడ‌లేదు'' అని అతడు చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X