'ఆరెంజ్' చిత్రానికి భాస్కర్ కాకుండా మరో డైరక్టర్!?
రామ్ చరణ్ తేజ తాజా చిత్రం "ఆరెంజ్"కు భాస్కర్ దర్శకుడు అనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో వార్త బయిటకు వచ్చింది. ఈ చిత్రానికి ఆనంద్ రంగా కూడా పనిచేస్తున్నారు. సిద్దార్ధతో ఓయ్ చిత్రం డైరక్ట్ చేసిన ఆనంద్ రంగా ఈ చిత్రంలోని రెండు పాటల చిత్రీకరణ దగ్గరుండి చూసుకున్నారు. అలాగే కొంత ప్యాచ్ వర్క్ కూడా చేస్తున్నారు. భాస్కర్..పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ఇలా షేర్ చేసి త్వరగా పూర్తి చేయటానికి ప్లాన్ చేసుకున్నారు. ఇక ఈ చిత్రం నవంబర్ లో విడుదల కానుంది. దాంతో స్పీడుగా చిత్రం ఫినిష్ చేయటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆనంద్ రంగా కు ఈ చిత్రం టైటిల్ కార్డులో ధాంక్స్ కార్డు వేస్తారు. అలాగే మంచి ఎమౌంట్ నే ముట్టచెప్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆనంద్ రంగా తన తదుపరి ప్రాజెక్టు శూన్యం ని త్వరలోనే ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
రామ్ చరణ్ తేజ్ ఆనంద్ రంగా ఆరెంజ్ ఆస్ట్రేలియా నాగబాబు జెనీలియా anand ranga ram charan teja orange nagababu genelia


Click it and Unblock the Notifications