PSPK 28: గబ్బర్ సింగ్ దర్శకుడు అస్సలు తగ్గట్లేదు.. అతిపెద్ద కాలేజ్ సెట్.. ఎంత ఖర్చు చేస్తున్నారంటే?
టాలీవుడ్ హై వోల్టేజ్ కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ వద్ద అంచనాకు మాములుగా ఉండవు. ఒక్కసారి హిట్టు కొట్టిన డైరెక్టర్ - హీరో కాంబో.. మరోసారి సినిమా చేస్తే అభిమానుల్లో అంచనాల డోస్ అమాంతంగా పెరిగిపోతుంటాయి. ఇక ప్రస్తుతం అందరి చూపు గబ్బర్ సింగ్ కాంబినేషన్ పైనే ఉంది. పవన్ కళ్యాణ్ 28వ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్.. రెండు పాత్రలు?
ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి కూడా రాలేదు కానీ అప్పుడే అనేక రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని ఒక కాలేజ్ స్టూడెంట్ గా అలాగే సెకండ్ హాఫ్ లో మరొక బాధ్యత గల పౌరుడిగా ఒక సమస్యపై పోరాడతాడని అంటున్నారు. ఎక్కువగా ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుందని సమాచారం.

ఎక్కువ భాగం సెట్స్ లోనే..
అయితే సినిమా ఆర్ట్ విషయంలో కూడా స్పెషల్ గా ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. సినిమా కథ ప్రకారం వివిధ ప్రాంతాల్లో షూట్ చేయాలని అనుకున్నారట. కానీ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఎక్కువ భాగం సెట్స్ లోనే షూట్ చేయాలని దర్శకుడు డిసైడ్ అయినట్లు సమాచారం.

భారీ కాలేజ్ సెట్
ఇక సినిమాకు పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితుడు ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయబోతున్నాడు. ఇప్పటికే కొంత ప్లానింగ్ సెట్టయినట్లు సమాచారం. ఇక సినిమాలో కాలేజ్ కు సంబంధించిన సన్నివేశాలు చాలా కీలకం కావడంతో ప్రత్యేకంగా ఒక భారీ కాలేజ్ సెట్ ను నిర్మించబోతున్నట్లు సమాచారం. దర్శకుడు హరీష్ శంకర్ కూడా ప్లానింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

రిలీజ్ ఎప్పుడంటే?
నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ తో మొదటిసారి వర్క్ చేస్తుండడంతో అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఖర్చు చేయాలని ఫిక్స్ అయ్యారు. సినిమాలో సెట్స్ కోసమే కోట్లల్లో ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇక కరోనా సెకండ్ వేవ్ హడావుడి తగ్గిన అనంతరం సినిమా షూటింగ్ ను ఈ ఎడాది చివరలో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమాను వచ్చే ఏడాది థియేటర్స్ లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











