Ananya Panday: లవర్‌తో అడ్డంగా దొరికిన లైగర్ హీరోయిన్.. ఏంటి ఆ హీరోతో అంత పని చేసేసిందా?

మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే బాలీవుడ్‌లోనే ఎక్కువగా లవ్ ట్రాకులు కనిపిస్తుంటాయి. అక్కడ డేటింగ్‌లు, లవ్ మ్యారేజ్‌లు, బ్రేకప్‌లు సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎన్నో జంటలు ఇప్పుడు ప్రేమలో మునిగితేలుతున్నాయి. ఈ క్రమంలోనే 'లైగర్' హీరోయిన్ అనన్య పాండే కూడా ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రేమ పక్షులు నైట్ టైం కెమెరాల కంటికి చిక్కినట్లు ఓ న్యూస్ దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

అలా వచ్చి వరుస చిత్రాలు:బాలీవుడ్ సీనియర్ స్టార్ చుంకీ పాండే కుమార్తెగా అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే సినిమా ద్వారా సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఇందులో తనదైన యాక్టింగ్‌తో మెప్పించిన ఆమె ఫేమస్ అయింది. దీంతో ఆ తర్వాత వరుసగా 'పతీ పత్నీ ఔర్ వో', 'అంగ్రేజీ మీడియం', 'ఖాలీ పీలీ', 'గెహరియాన్' వంటి చిత్రాల్లో నటించి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది.

Ananya Panday and Aditya Roy Kapur Date Night News Goes Hot Topic In B Town

లైగర్‌ మాత్రం బిగ్ డిజాస్టర్:అనన్య పాండే తన సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ఎక్కువగా హిందీ సినిమాలనే చేసింది. కానీ, విజయ్ దేవరకొండ - డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన 'లైగర్' మూవీ ద్వారా ఆమె దక్షిణాది మొత్తం పరిచయం అయింది. అయితే, ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అవడంతో అనన్యకు బిగ్ షాక్ తగిలింది. అంతేకాదు, ఈ చిత్రంలో ఆమె నటనపై ట్రోల్స్ వచ్చాయి.

ఆ సినిమాలతో ఫుల్ బిజీగా:ఎక్కువగా అనన్య పాండే తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే ఒప్పుకుంటోంది. ఇటీవలే ఆమె 'డ్రీమ్ గర్ల్ 2' అనే సినిమాతో వచ్చింది. ఇప్పుడు మాత్రం ఈ చిన్నది 'ఖో గయా హమ్ ఖహాన్', 'కంట్రోల్', 'శంకర' వంటి సినిమాలతో బిజీగా ఉంది. అలాగే, Call Me Bae టీవీ సిరీస్‌లో నటిస్తోంది. వీటితో పాటు అనన్య కొన్ని వెబ్ సిరీస్‌లు, ఆల్బమ్‌లు చేయనుంది.

Ananya Panday and Aditya Roy Kapur Date Night News Goes Hot Topic In B Town

ఆ హీరోతో అనన్య లవ్ ట్రాక్:వరుస పెట్టి సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తోన్న అనన్య పాండే.. తన పర్సనల్‌ లైఫ్‌ను కూడా యమ ఎంజాయ్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆమె లవ్ లైఫ్ గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అనన్య పాండే.. బాలీవుడ్ స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో ప్రేమలో విహరిస్తోన్న విషయం తెలిసిందే.

జంటగా రచ్చ చేస్తున్నారు:గత ఏడాది కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీకి అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ జంటగా హాజరైన సంగతి విధితమే. అంతేకాదు, అక్కడ ఇద్దరూ కలిసి రొమాంటిక్ డ్యాన్స్‌తో రెచ్చిపోయారు. అప్పుడే వీళ్ల బంధం గురించి బయటకు వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా గత దీపావళి పార్టీలోనూ అనన్య, ఆదిత్య జంటగా కనిపించి ఇండైరెక్టుగా బయటపెట్టేశారు.

Ananya Panday and Aditya Roy Kapur Date Night News Goes Hot Topic In B Town

మళ్లీ జంటగా.. మాల్దీవ్స్‌లో:చాలా రోజులుగా పీకల్లోతు ప్రేమలో ఉన్న అనన్య పాండే - ఆదిత్య రాయ్ కపూర్ బహిరంగంగా తమ బంధాన్ని మాత్రం బయట పెట్టలేదు. కానీ, జంటగానే తరచూ ట్రిప్పులకు వెళ్తూ తెగ చిల్ అవుతున్నారు. ఇందులో భాగంగానే ఆ మధ్య స్పెయిన్‌లో జరిగిన Arctic Monkeys concertలో వీళ్లిద్దరూ పాల్గొన్నారు. ఇటీవలే మాల్దీవ్స్ టూర్‌కు కూడా జంటగా వెళ్లి రచ్చ చేశారు.

డేట్ నైట్‌.. కెమెరాలకు చిక్కి:క్రమంగా తమ బంధాన్ని బలపరచుకుంటోన్న అనన్య పాండే - ఆదిత్య రాయ్ కపూర్ తాజాగా ముంబైలో డేట్ నైట్‌కు వెళ్లినట్లు తెలిసింది. వీళ్లిద్దరూ ముఖాలకు మాస్కులు పెట్టుకుని కారులో వెళ్తుండగా మీడియా ప్రతినిధులకు చిక్కినట్లు సమాచారం. అయితే, ఈ ఫొటోలను బయటకు రానీయకుండా వీళ్లు జాగ్రత్త పడ్డారని టాక్. దీంతో ఈ న్యూస్ బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X