ఊహించని చోట హీరోయిన్ ప్లాస్టిక్ సర్జరీ.. అవి పెద్దగా కనిపించేందుకే అలా!
ఇండియాలోని అన్ని సినిమా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే బాలీవుడ్‌లోనే ఎక్కువగా స్టార్ల వారసులు పరిచయం అవుతున్నారు. అందులో కొందరు మాత్రమే హై లెవెల్‌కు వెళ్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ఒకరు. టీనేజ్‌లో ఉన్నప్పుడే హీరోయిన్‌గా వచ్చిన ఈ బ్యూటీ.. ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్‌డమ్‌ను సంపాదించింది. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో అనన్య తన బాడీ పార్టీలకు సర్జరీ చేయించిందనే వార్త వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే...
అలా వచ్చి ఫుల్ పాపులర్:బాలీవుడ్ సీనియర్ యాక్టర్ కుమార్తెగా అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఆమెకు మంచి పేరు కూడా లభించింది. ఫలితంగా అనన్య 'పతీ పత్నీ ఔర్ వో', 'అంగ్రేజీ మీడియం', 'ఖాలీ పీలీ', 'గెహరియాన్' వంటి చిత్రాల్లో నటించి ఫుల్ పాపులర్ అయిపోయింది.

లైగర్‌తో ఆదిలోనే బ్రేక్‌లు:అనన్య పాండే కెరీర్ ఆరంభం నుంచీ బాలీవుడ్ చిత్రాలకే పరిమితం అయింది. అయితే, విజయ్ దేవరకొండ - డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన 'లైగర్' మూవీ ద్వారా ఆమె దక్షిణాది మొత్తం పరిచయం అయింది. అయితే, ఈ సినిమా ఘోర పరాజయం పాలవడంతో అనన్యకు షాక్ తగిలింది. దీంతో ఆమె సౌత్ ప్రయత్నాలు అన్నీ ఆపేయాల్సి వచ్చింది.
ఇప్పుడా చిత్రాలు చేస్తూ:సినిమాల్లోకి వచ్చి చాలా కాలమే అవుతోన్నా అనన్య పాండే తక్కువ మూవీలే చేసింది. దీనికి కారణం తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే చేస్తూ చాలా నెమ్మదిగా కెరీర్ సాగిస్తుండడమే. అయితే, ఇప్పుడు మాత్రం అనన్య 'బ్యాడ్ న్యూస్', 'కంట్రోల్', 'శంకరా' వంటి సినిమాలతో బిజీగా ఉంది. వీటితో పాటు ప్రైవేట్ ఆల్బమ్స్‌లో కూడా ఈ చిన్నది కనిపించబోతుంది.

అందులో అలాంటివేగా:సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తనదైన చిత్రాలతో తెగ సందడి చేస్తోన్న అనన్య పాండే.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో మాత్రం ఓ రేంజ్‌లో అందాల విందు ఇస్తోంది. ముఖ్యంగా అప్పుడప్పుడు ఈ స్టార్ కిడ్ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను వదులుతూ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే పిక్స్‌ను వదులుతోంది.
ఆ ఫొటోలు షేర్ చేసేసి:వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోనూ తనదైన రీతిలో సందడి చేస్తోంది. ముఖ్యంగా తరచూ ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె వదిలిన ఫొటోల్లో అనన్య పాండే ముఖంలో ప్రధానమైన మార్పు కనిపిస్తోంది. ఈ విషయాన్ని నెటిజన్లు హైలైట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

వాటికి సర్జరీ అవడంతో:తాజాగా అనన్య పాండే కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె పెదాలు గతంలో మాదిరిగా కాకుండా షేప్ మారినట్లు కనిపిస్తున్నాయి. దీంతో ఈ స్టార్ హీరోయిన్ వాటికి సర్జరీ చేయించుకుందని ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అందుకు తగ్గట్లే నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. దీంతో అనన్య ప్లాస్టిక్ సర్జరీ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











