మహేష్ బాబు సరసన బాలీవుడ్ భామ.. సర్కారు పారి పాటలో..

సరిలేరు నీకెవ్వరు మూవీ తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సర్కారు వారీ పాట. ఈ చిత్రంలో హీరో మహేష్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే విషయం ఫిలింనగర్‌లో చర్చనీయాంశమయ్యాయి. తెరపైకి చాలా మంది హీరోయిన్ల పేరు వచ్చాయి. అయితే అధికారికంగా ఏ హీరోయిన్ పేరును కూడా ధృవీకరించలేదు. తాజాగా మహేష్ పక్కన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

ఇటీవల సర్కారు వారి పాట చిత్రానికి సంబంధించిన నిర్మాతలు ఇటీవల అనన్య పాండేను సంప్రదించినట్టు సమాచారం. అనన్య పాండే రిక్వెస్ట్ మేరకు దర్శకుడు పరుశురాం ఇటీవల ఆమెకు ఫోన్‌లో స్క్రిప్టును చెప్పినట్టు తెలిసింది. దాంతో పరుశురాం చెప్పిన కథ, తన పాత్ర తీరు విన్న తర్వాత ఆమె ఇంప్రెస్ అయ్యారని, సినిమాలో నటించేందుకు సానుకూలంగా స్పందించారని చెప్పినట్టు యూనిట్ సభ్యులు తెలిపారు.

 Ananya Panday in Mahesh Babus Sarkaru Vaari Paata

ఇదిలా ఉండగా మహేష్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటించనున్నారు. రెండో హీరోయిన్‌ కోసం అనన్య పాండేను ఎంపిక చేసినట్టు సమాచారం. అనన్య ఇప్పటికే విజయ్ దేవరకొండ నటించే ఫైటర్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.

అయితే గతంలో రెండో హీరోయిన్ కోసం నివేదా థామస్, ఇతర హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చారు. ఇక ఈ చిత్రంలో సుదీప్ కిచ్చ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం, పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫర్‌గా, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా ఈ చిత్రానికి పనిచేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X