ఆ హీరోయిన్‌తో బ్రేకప్.. టాప్ మోడల్‌తో తిరుగుతోన్న స్టార్‌ హీరో? ఆ పోస్ట్‌తో హింట్!

చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య రిలేషన్ ఎప్పుడు మొదలవుతుందో? ఎప్పుడు ఎండో అవుతుందో? ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు బట్టలు మార్చుకున్నంత ఈజీగా భాగస్వాములను మార్చేస్తున్నారు సెలబ్రెటీలు. ఎవరు ఎవరితో కనిపిస్తారో తెలియడం లేదు. బాలీవుడ్‌లో ఈ కల్చర్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పదుల సంఖ్యలో బాయ్‌ఫ్రెండ్స్‌/ గర్ల్‌ఫ్రెండ్స్‌ను మార్చేసినవారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి విషయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అనన్య పాండే. అలాంటి ఆమెకే షాకిచ్చాడు మాజీ బాయ్‌ఫ్రెండ్.

లైగర్‌తో డిజాస్టర్
నటుడు చుంకీ పాండే కుమార్తెగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే షార్ట్ గ్యాప్‌లోనే హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సైజ్ జీరో భామగా క్రేజ్ తెచ్చుకున్న ఈమెకు స్టూడెండ్ ఆఫ్ ది ఇయర్ 2తో బ్రేక్ వచ్చింది. ఈ మూవీ తర్వాత అనన్యకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. తెలుగులో విజయ్ దేవరకొండ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాలో హీరోయిన్‌‌గా టాలీవుడ్‌‌లో ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. టాలీవుడ్‌లో గట్టిగా జెండా పాతుదాం అనుకున్న అనన్య అంచనాలు తప్పాయి.

Ananya Pandey s Ex boyfriend Aditya Roy Kapur Finds Love Again In Goan model Georgina Dsilva

ఎఫైర్స్‌తోనే వార్తల్లో
సినిమాల కంటే వ్యక్తిగత విషయాలు, ఎఫైర్లతో వార్తల్లో నిలిచారు అనన్య పాండే. గతంలో ఇషాన్ ఖట్టర్, కార్తీక్ ఆర్యన్‌ వంటి స్టార్ హీరోలతో ఆమె డేటింగ్ చేశారు. వీరిలో ఆషికీ 2 ఫేమ్ ఆదిత్యరాయ్ కపూర్‌తో ప్రేమాయణం మాత్రం హైలైట్‌గా నిలిచింది. వీరిద్దరూ దాదాపు పెళ్లి పీటల వరకు వెళ్లారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ సడెన్‌గా ఆదిత్యకు బ్రేకప్ చెప్పేశారు అనన్య. బ్రేకప్ తర్వాత దాని నుంచి కోలుకోవడానికి తన మాజీ బాయ్‌ఫ్రెండ్ ఫోటోలు కాల్చేసినట్లు ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. ప్రస్తుతం అనన్య పాండే.. వాకర్ బ్లాంకోతో డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆదిత్య ఇంట్లోకి అగంతకురాలు
అనన్య మరో తోడు వెతుక్కోగా మరి ఆదిత్య రాయ్ కపూర్ పరిస్ధితి ఏంటీ? ఆయన ఏం చేస్తున్నారు? మళ్లీ డేటింగ్ మొదలు పెట్టారా? అంటూ బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఈ ఏడాది మెట్రో ఇన్ దినో సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆదిత్య రాయ్ కపూర్ కొత్తగా ఏ సినిమాను అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్‌లు కథా చర్చల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొన్నామధ్య ఆదిత్య ఇంట్లోకి ఓ గుర్తు తెలియని మహిళ ప్రవేశించి నానా హంగామా సృష్టించింది. అయితే ఆ సమయంలో హీరో గారు ఇంట్లో లేరు. సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఆదిత్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అరెస్ట్ చేశారు.

ఆ మోడల్‌తో ఆదిత్య ఎఫైర్?
మరోవైపు.. అనన్యతో బ్రేకప్ తర్వాత ఆదిత్య రాయ్ కపూర్ ఓ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. గోవాకు చెందిన టాప్ మోడల్, ఫోటోగ్రాఫర్ జార్జియానా డిసిల్వతో ఆయన ప్రేమాయణం నడుపుతున్నట్లుగా బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరి సోషల్ మీడియా పోస్టులు, ఒకరికొకరు ఇన్‌స్టాలో ఫాలో కావడం, ఒకే లోకేషన్‌లో ఉండి వేరు వేరుగా ఫోటోలు పెట్టడాన్ని నెటిజన్లు కనిపెట్టి ఆదిత్య - డిసిల్వ మధ్య ఏదో జరుగుతుందని చెబుతున్నారు. ఓ వీడియోలో ఆదిత్య రాయ్ కపూర్ ఇద్దరితో కలిసి ఫుట్‌బాల్ ఆడుతున్నారు. వీరిలో జార్జియానా ఉన్నట్లుగా నెటిజన్లు ఆరోపిస్తున్నారు. జార్జియానా ఇంట్లోనే ఆదిత్య ఉన్నట్లుగా పలువురు చెబుతున్నారు. మరి నిజంగానే వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తోందా? లేదా? తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X