అనసూయ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్.. ఖిలాడీలో మరో ఊహించని రోల్ ?

టెలివిజన్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ అనుకోని రీతిలో ఇప్పుడు నటిగా బిజీ అయింది. ఆమెను దృష్టిలో పెట్టుకుని కొంతమంది సినిమాలు రాసుకుంటుంటే మరికొంత మంది దర్శకులు మంచి పాత్రలు కూడా డిజైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పుష్ప సినిమాతో హిట్ అందుకున్న ఆమె మరో సినిమాలో భాగమైంది. అయితే ఆమె పాత్ర గురించి ఇప్పుడు ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

జబర్దస్త్ క్రేజ్

జబర్దస్త్ క్రేజ్

సాక్షి టీవీలో న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ఆ జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై చాలా క్రేజ్ తెచ్చుకుంది.. ఒకానొక సమయంలో గురువారం వస్తుందంటే అనసూయని చూడడానికి సైతం చాలామంది జబర్దస్త్ ప్రోగ్రాం చూసే వాళ్ళు అంటే అతిశయోక్తి కాదు. ఈమెకు టెలివిజన్ లో వచ్చిన క్రేజ్ ను సినిమా నిర్మాతలు వాడుకోవడానికి ఆమెకు అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు.

రంగమ్మత్తగా మారి

రంగమ్మత్తగా మారి

రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో గతంలో రిలీజైన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఆమె మరింత క్రేజ్ సంపాదించింది. ఆ దెబ్బతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. అందులో భాగంగానే పుష్ప సినిమాలో కూడా ఎం, మంచి రోల్ పట్టేసింది. సునీల్ భార్య ద్రాక్షాయని అనే పాత్రలో నటించి మెప్పించింది.

 'ఖిలాడి' సినిమాలో

'ఖిలాడి' సినిమాలో


ద్రాదాక్షాయణి క్యారెక్టర్ లో డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తూ.. తన నటనతో అనసూయ ఆకట్టుకుంది. ఇక 'పుష్ప' పార్ట్ 2లో అనసూయ రోల్ హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ రవితేజ నటించిన 'ఖిలాడి' సినిమాలో కూడా అనసూయ నటించింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా వుండబోతుందనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.

బ్రాహ్మణ మహిళ పాత్ర

బ్రాహ్మణ మహిళ పాత్ర

జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ సినిమాలో అనసూయ డ్యూయల్ రోల్ పోషించింది అని అంటున్నారు. అందులో ఒక పాత్ర బ్రాహ్మణ మహిళ పాత్ర అని తెలుస్తోంది. అయితే రెండో పాత్ర ఎలా ఉంటుందనేది తెలియలేదు. అయితే కథ ప్రకారం.. ఒక పాత్ర చనిపోతుందట.. రెండో పాత్ర మాత్రం సినిమా మొత్తం కనిపిస్తుందని చెబుతున్నారు. నిజానికి అనసూయ కూడా నిజజీవితంలో బ్రాహ్మణ మహిళే అయినా సినిమాలో మాత్రం పాతకాలపు బ్రాహ్మణ మహిళ పాత్ర అని తెలుస్తోంది.

ఫిబ్రవరి 11న

ఫిబ్రవరి 11న


కథనం సినిమా తరువాత మధ్యకాలంలో ఆమె నటించిన పూర్తి స్థాయి రోల్ ఇదేనని టాక్. ఈ సినిమాతో అనసూయ కెరీర్ మలుపు తిరుగుతుందని చెబుతున్నారు. ఐయితే సినిమా కూడా మంచిగా వచ్చిందని అంటున్నారు. సినిమాలో చేసిన అందరూ మంచి పేరు తెచ్చుకోవడం ఖాయమని అంటున్నారు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. కోనేరు సత్యనారాయణ, హవీష్ నిర్మించిన ఈ సినిమాను రమేష్ వర్మ డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా అవుట్ ఫుట్ చూసి విడుదలకు ముందే కోటిన్నర రూపాయల కారుని నిర్మాతలు గిఫ్ట్ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X