మరోసారి సంచలనానికి తెర తీసేందుకు రెడీ.. గర్బవతిగా అనసూయ!!
అనసూయ బుల్లితెరపై గ్లామర్ డాల్‌గా గుర్తింపును తెచ్చుకుంది. జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయిన అనసూయ.. అక్కడ అందాల ఆరబోతకు తెరదీసింది. అలా గ్లామర్ యాంకర్‌గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఇది కేవలం తనలోని ఒక్క కోణం మాత్రమేనని, తనలోనూ ఓ గొప్ప నటి దాగుందని నిరూపించుకుంది. క్షణం, రంగస్థలం లాంటి చిత్రాలతో అనసూయ ఇమేజ్ ఎక్కిడికో వెళ్లిపోయింది.

అనసూయపై గౌరవం..
యాంకర్‌గా అనసూయపై ఎన్ని రకాల ట్రోలింగ్స్ వచ్చినా కూడా నటిగా మాత్రం వందకు వంద మార్కులు కొట్టేసింది. క్షణం సినిమా అనసూయ జీవితాన్ని మార్చేస్తే.. రంగస్థలంలోని రంగమ్మత్త తెలుగులో ప్రజల్లో ఆమె స్థాయిని స్థానాన్ని పెంచింది. అనసూయలోని అద్భుతమైన నటిని ఈ చిత్రంతోనే గుర్తించారు. అందుకే అనసూయ కూడా చేస్తే అలాంటి గొప్ప పాత్రలే చేయాలని నిర్ణయించుకుంది.

ఆచితూచి..
మంచి పాత్రలు చేయాలన్న ఉద్దేశ్యంతో అనసూయ ఆచితూచి కథలను ఎంచుకుంటోంది. వరుసగా సినిమాలు చేసేయాలి.. డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశ మాత్రం కనిపించడం లేదు. అందుకే రంగస్థలం లాంటి చిత్రం తరువాత ఎంతో గ్యాప్ తీసుకున్ని మీకు మాత్రమే చెప్తా అనే చిత్రంలో ఓ రోల్ పోషించింది. అయితే అది అంతగా క్లిక్ అవ్వలేదు.

మరో కొత్త ప్రాజెక్ట్..
అనసూయ తాజాగా కొత్త ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. థాంక్యూ బ్రదర్ అంటూ రాబోతోన్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను రానా చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ టైటిల్ పోస్టర్‌లోనే ఎన్నో సంకేతాలు వదిలారు. ఈ మూవీ కథ ఏంటి? ఎలా ఉండబోతోంది? నేపథ్యం ఏంటన్న సంగతులన్నీ చెప్పేశారు.
Recommended Video

గర్భవతిగా అనసూయ..
థాంక్యూ బ్రదర్‌లో అనసూయ, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్‌గా నటిస్తున్నారు. టైటిల్ పోస్టర్‌లో లిఫ్ట్.. దాని ముందు మాస్క్ పడేసి ఉండటం చూస్తే.. అది కరోనా నేపథ్యంలో తీసినట్టు అనిపిస్తోంది. ఇక టైటిలో లోగోలో ఓ గర్భవతి బొమ్మను ఇమడ్చారు. అంటే ఈ సినిమాలో అనసూయ గర్భవతిగా నటిస్తుందనే సంకేతాన్ని వదిలారు. అదే గనుక నిజమైతే.. అనసూయ తన నటనతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.


Click it and Unblock the Notifications











