అనసూయకి మళ్లీ నిరాశ తప్పదా? అల్లు అర్జున్‌తో అలాంటి షాక్!
తెలుగు సినిమా దగ్గర చాలా మంది లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ని బాగా వాడుకున్న వారు ఉన్నారు. మొదటిగా సినిమాల్లోకే వచ్చినప్పటికీ అప్పుడు సరిగ్గా గుర్తింపు లేక లేదా అవకాశాలు లేని చాలా మంది ట్రాక్ మార్చి మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చి సూపర్ హిట్ అయ్యారు. మరి అలనాటి నటుల్లో గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. కాగా అనసూయ మొదటి సిల్వర్స్ స్క్రీన్ పైనే వచ్చింది.
కానీ అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. దీనితో స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా చేసిన తర్వాత ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఆమెకి సినిమాల్లో తన రోల్ స్ట్రాంగ్ అనిపిస్తే తప్ప చెయ్యను అని చెప్పేసింది. అలా తన కెరీర్ లో నిలిచిపోయే రోల్ గా అయితే "రంగస్థలం" లో రంగమ్మత్త పాత్ర నిలిచిపోయింది.

ఆ తర్వాత మళ్ళీ అదే సినిమా దర్శకుడు సుకుమార్ నుంచి వచ్చినా భారీ చిత్రం "పుష్ప" లో కూడా ఆమె విలక్షణ పాత్ర దాక్షాయణిగా చేస్తుండడంతో మరో ఐకానిక్ పాత్ర ఆమెకి పడుతుంది అని అంతా అనుకున్నారు. అలాగే ఆ సినిమా విడుదలకి ముందు కూడా అనసూయ రోల్ ని సోషల్ మీడియాలో లేపారు. కానీ తీరా సినిమాలో చూస్తే అక్కడ అసలు అంతేమి లేదు. దీనితో పార్ట్ 2 లో మాత్రం ఆమెకి మంచి స్కోప్ ఉంటుందని టాక్ వచ్చింది.
కాగా ఇప్పుడు అనసూయకి పార్ట్ 2 లో కూడ పెద్దగా ఇంపార్టెన్స్ లేదా అనిపిస్తుంది. ఎందుకో ఈమె తన రోల్ విషయంలో అంత కాన్ఫిడెంట్ గా లేనట్టుగా కనిపిస్తుంది. సినిమాలో పెద్ద రోల్ ఆశిస్తున్నామని ఓ ఫాలోవర్ అడిగితె అది నేనెలా చెప్పగలను అంతా మా డైరెక్టర్ చేతిలోనే ఉందని ఆమె తేల్చేసింది. ఒకవేళ సాలిడ్ రోల్ పడి ఉంటే డెఫినెట్ గా అనసూయ లాంటి నటి నుంచే సమాధానం వేరేలా ఉండేది.

సో ఇప్పుడు సుకుమార్ ఎంతవరకు తా పాత్రని డిజైన్ చేసారో అంతలో తన పని తాను చేసుకుంటూ వచ్చేస్తుంది అని చెప్పాలి. మరి పుష్ప పార్ట్ 1 పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ అందులో అనుకున్న రేంజ్ బ్రేక్ రాలేదు ఇప్పుడు పార్ట్ 2 లో అయినా స్కోప్ ఉంటుందా అంటే.. అల్లు అర్జున్ క్యారెక్టర్ ముందు అంతగా ఎలివేట్ కాదు. కాబట్టి ఈసారి కూడా బడా మూవీలో గెస్ట్ పాత్రతో ఆమెకి దెబ్బ తప్పేలా లేదనే అనుకోవాలంటున్నారు.
కాగా ఈ భారీ సినిమాలో తనతో పాటుగా సునీల్ కూడా నటిస్తుండగా వీరితో కలిపి వెర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ సీన్స్ కి మంచి ఇంపార్టెన్స్ ఉన్నట్టు వినిపిస్తుంది. సో ఫోకస్ ఎక్కువగా అతని వైపే ఉంటుందని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ డిసెంబర్ 6న సినిమా వరల్డ్ వైడ్ 6 భాషల్లో విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











