‘రంగస్థలం’ తర్వాత..... ఫన్ అండ్ ఫ్రస్టేషన్లో అనసూయ?
'రంగస్థలం' సినిమాలో అనసూయ పోషించిన 'రంగమ్మత్త' పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాత్రలో అనసూయ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనే ప్రశంసలు అందుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో అనసూయకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అనసూయ మరో తెలుగు సినిమాలో రంగమ్మత్త రేంజిలో పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు అవకాశం ఉన్న విలేజ్ ఉమెన్ రోల్ దక్కించుకున్నట్లు సమాచారం.

‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్'లో అనసూయ?
టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ‘ఎఫ్-2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్' అనే సినిమా చేస్తున్నారు. వెంకటేష్-వరుణ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్ర చేయబోతున్నట్లు సమాచారం.
Recommended Video


విలేజ్ ఉమెన్ పాత్రలో అనసూయ
‘రంగస్థలం' మూవీలో రంగమ్మత్తగా అనసూయ పాత్రకు మంచి మార్కులు పడటంతో...... ఇదే తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా అనసూయ కోసం ఓ స్పెషల్ పాత్రను అనిల్ రావిపూడి రాసినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

అనసూయకు వరుస అవకాశాలు
ప్రస్తుతం అనసూయ ‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మి' అనే మూవీలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ మూవీ మొత్తం అనసూయ చుట్టే తిరుగుతుందని సమాచారం. ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయింది.

అనసూయ ‘సచ్చిందిరా గొర్రె'
అనసూయ నటించిన మరో చిత్రం ‘సచ్చిందిరా గొర్రె' త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీధర్ రెడ్డి యార్వా దర్శకత్వం వహించిన ఈ చిత్రం కామెడీ నేపథ్యంలో సాగుతుంది. శ్రీనివాసరెడ్డితో సహా పలువురు కమెడియన్స్ నటించారు. ఒగ్గుకథ తరహాలో ఈ సినిమా ఉంటుందని టాక్.


Click it and Unblock the Notifications











