»   » రంగస్థలంలో అనసూయ పాత్ర ఇదేనట?: సుకుమార్ ఎలా చూపించబోతున్నారో తెలుసా!..

రంగస్థలంలో అనసూయ పాత్ర ఇదేనట?: సుకుమార్ ఎలా చూపించబోతున్నారో తెలుసా!..

Subscribe to Filmibeat Telugu
రంగస్థలంలో అనసూయ పాత్ర ఇదేనట ? సుకుమార్ ఎలా చూపించబోతున్నారో తెలుసా!..

ఈ ఏడాది విడుదల కాబోతున్న మోస్ట్ అవెయిటింగ్ మూవీస్‌లో రాంచరణ్ రంగస్థలం కూడా ఒకటి. 1980ల నాటి నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ ఈ కథను తెరకెక్కిస్తుండటంతో సినిమాపై మరింత క్యురియాసిటీ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన రాంచరణ్ ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించగా.. కథ, పాత్రలకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. కొద్ది రోజులుగా అనసూయ పాత్ర గురించి మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతోంది.

యంగ్ హీరోతో అనసూయ ప్రేమాయణం?: అడిగితే ఏమందో తెలుసా!..

 క్లారిటీ ఇచ్చిన అనసూయ:

క్లారిటీ ఇచ్చిన అనసూయ:

రంగస్థలం సినిమాలో తనది అత్త పాత్ర కాదని ఇటీవలే క్లారిటీ ఇచ్చారు అనసూయ. ట్విట్టర్ చాట్‌లో ఓ అభిమాని.. 'రంగస్థలంలో మీరు అత్త పాత్ర చేస్తున్నారా?' అడిగిన ప్రశ్నకు బదులుగా 'నో' అని చెప్పేశారు అనసూయ.


ఊర మాస్ రంగస్థలానికి, మెగాస్టార్ సినిమాకు లింకేంటి?: చిరంజీవి నిజంగా అలా అన్నారా?


 'రంగమ్మత్త'గా అనసూయ:

'రంగమ్మత్త'గా అనసూయ:

తాజాగా తెర పైకి వచ్చిన ఊహాగానాల ప్రకారం రంగస్థలంలో అనసూయది అత్త పాత్రేనని అంటున్నారు. అయితే ఆమె రాంచరణ్ కు అత్తగా నటించడం లేదని, 'రంగమ్మత్త' అనే ఓ పాత్రలో నటించబోతుందని టాక్.


ఊరి సెంటిమెంట్..:

ఊరి సెంటిమెంట్..:

సాధారణంగా పల్లెటూళ్లలో ఒకరినొకరు వరుసలతో పిలుచుకోవడం అలవాటు. బాబాయి, మామ, అత్త.. ఇలా ప్రతీ ఒక్కరిని ఏదో పేరుతో పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అనసూయ పాత్రను కూడా 'రంగమ్మత్త'గా తీర్చిదిద్దారట సుకుమార్.


 అందరికీ తల్లో నాలుకగా ..:

అందరికీ తల్లో నాలుకగా ..:

పల్లెటూళ్లలో కొంతమంది ఉంటారు. అందరికీ తల్లో నాలుకగా మెదులుతూ కాస్త స్పెషల్ గా కనిపిస్తారు. ఇప్పుడు రంగస్థలంలో అనసూయ పోషించే పాత్ర కూడా అలాగే ఉంటుందని టాక్.


'రంగమ్మత్త' లాంటి క్యాచీ నేమ్ అయితే ఆ పాత్ర జనాలకు మరింత చేరువవుతుందని, అదీగాక రంగస్థలం టైటిల్‌కు దగ్గరగా ఉందని దర్శకుడు సుకుమార్ ఆ పేరునే ఎంచుకున్నట్లు తెలుస్తోంది.


 ఇంతవరకు రివీల్ కాలేదు..:

ఇంతవరకు రివీల్ కాలేదు..:

రాంచరణ్ రంగస్థలానికి ఒకప్పటి మెగాస్టార్ సినిమాతో దగ్గరి ఛాయలు ఉంటాయని మొన్నీమధ్యే ఓ ప్రచారం జరిగింది. కానీ అందులో ఎటువంటి వాస్తవం లేదనేది ఇన్ సైడ్ టాక్. ఇప్పటికైతే కథకు సంబంధించి ఏ చిన్న క్లూ కూడా సుకుమార్ నుంచి రివీల్ కాలేదు.


 నటనకు స్కోప్ ఉన్న సినిమా..:

నటనకు స్కోప్ ఉన్న సినిమా..:

పాత్ర లుక్‌ను చూస్తుంటేనే.. కచ్చితంగా రాంచరణ్ గత సినిమాలకు ఇది భిన్నంగా ఉండే సినిమా అని అర్థమవుతోంది. నటనకు మంచి స్కోప్ ఉన్న సినిమా కావడంతో.. ఇందులో గనుక రాంచరణ్ మెప్పించగలిగితే ఇక ఆయనకు తిరుగుండదనే చెప్పాలి.


English summary
Anchor turned actress Anasuya made her mark as an actor with Kshanam movie where she playing a negative role. Post the successful debut she gt very choosy while selecting characters that are offered to her and signed only countable movies
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu