అనసూయ చేసిన పనికి రామ్ చరణ్ అలా ఫిక్స్.. లీకైన ‘ఆచార్య’ సీక్రెట్!
అటు బుల్లితెరపై తనదైన శైలి యాంకరింగ్‌తో మెప్పిస్తూ.. ఇటు వెండితెరపై మంచి మంచి పాత్రలు పోషిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్. అందంతో పాటు టాలెంట్ ఉన్న నటి కావడంతో అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. అందుకే ఓ వైపు టీవీ షోలు.. మరోవైపు సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే అనసూయ - రామ్ చరణ్ మధ్య జరిగిన ఓ సీక్రెట్ లీక్ అయింది. దీంతో ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే.....

అదొక్కటే అనసూయ జీవితాన్ని మార్చేసింది
కెరీర్ ఆరంభంలో అనసూయ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. ఆ తర్వాత ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా పని చేసింది. అనంతరం యాంకరింగ్ కెరీర్‌ను మొదలెట్టింది. ఈ క్రమంలోనే ‘జబర్ధస్త్' అనే కామెడీ షోలోకి ఎంటర్ అయింది. దీంతో అమ్మడి జీవితం మారిపోయింది. ఈ షో వల్ల అనసూయకు మంచి గుర్తింపు రావడంతో పాటు ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.

యాంకర్‌కు జబర్ధస్త్ ఎలాగో... రంగస్థలం అలా
జబర్ధస్త్ వల్ల అనసూయకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె సినిమాల్లోకి సైతం ఎంటర్ అయింది. అక్కడ కొన్ని చిత్రాల్లో అత్యుత్తమ నటనను కనబరిచి కితాబందుకుంది. వాటిలో ‘రంగస్థలం' సినిమాలో చేసిన రంగమ్మత్త పాత్ర మాత్రం అందరికీ గుర్తుండిపోతోంది. దీని వల్లే ఆమెకు సినీ ఆఫర్లు ఎక్కువయ్యాయి.

అందులో మాత్రం చాలా హాట్‌గా కనిపిస్తోంది
వరుస టీవీ షోలు.. చేతి నిండా సినిమాలు ఉన్నప్పటికీ.. అనసూయ భరద్వాజ్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అంతేకాదు, ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసి హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.

భర్తకు దూరమై... ఆయనకు దాసిగా మారింది
అనసూయ ప్రస్తుతం ‘రంగమార్తాండ' అనే సినిమా చేస్తోంది. మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్'కు రీమేక్‌గా రాబోతున్న ఈ సినిమాను కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అనసూయ పెళ్లి చేసుకోకుండా ఉండే దేవదాసిలా కనిపించబోతుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆమె రోల్ స్పైసీగా ఉంటుందట. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

స్పెషల్‌గా చేయడానికి సిద్ధమైన హాట్ యాంకర్
తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఒప్పుకుంటున్న అనసూయ.. అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరిస్తోంది. ఇక, తాజాగా ఆమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య'లోనూ ఓ పాటలో కనిపించబోతుందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రెజీనాతో స్పెషల్ సాంగ్ పూర్తి చేయడంతో.. ఈ మూవీలో రెండోది కూడా ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Recommended Video

అనసూయ చేసిన పనికి రామ్ చరణ్‌కు లాభం
తాజాగా ‘ఆచార్య'లో రెండో స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే రామ్ చరణ్ ఎపిసోడ్‌లో ఈ పాట ఉంటుందట. అనసూయతో రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేసి.. అక్కడకు వచ్చిన శత్రువులను చంపాలని నక్సలైట్ అయిన చరణ్ ప్లాన్ చేస్తాడట. పాటకు ముందు అనసూయకు చరణ్‌తో ఓ సన్నివేశం కూడా పెట్టారని సమాచారం.


Click it and Unblock the Notifications











