God Father: చిరంజీవిని ఇరికించబోతున్న అనసూయ.. టాలీవుడ్‌లో అందరి దృష్టి దీనిమీదే!
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంతో కనిపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటికే 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహా రెడ్డి' వంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. అలాగే, కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాను కూడా పూర్తి చేసుకున్నారు.
ఇక, ఇప్పుడు పలు చిత్రాలను ప్రకటించడంతో పాటు వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. దీంతో తీరిక లేకుండా షూటింగ్‌ల మీద షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం!

గాడ్ ఫాదర్‌గా మారిన చిరంజీవి
స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ మలయాళంలో తెరకెక్కించిన చిత్రమే ‘లూసీఫర్'. ఈ సినిమా తెలుగు సహా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని చోట్లా దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దీన్నే ‘గాడ్ ఫాదర్'గా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు.

పూర్తిగా మార్చేసిన మోహన్ రాజా
‘లూసీఫర్' మూవీని తెలుగులోకి రీమేక్ చేసే బాధ్యతలను యంగ్ డైరెక్టర్ సుజిత్ తీసుకున్నారు. కానీ, అనివార్య కారణాలతో అతడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత మోహన్ రాజా దీన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చాడు. అలాగే, ఇందులో హీరోయిన్ పాత్రను కూడా జత చేశాడు. హీరో పాత్రను కూడా ఎలివేట్ చేసి స్క్రిప్టును పూర్తిగా మార్చేశాడని తెలిసింది.

బడా స్టార్స్ కూడా.. ఒక్కొక్కరుగా
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘గాడ్ ఫాదర్' మూవీలో చాలా మంది స్టార్లు భాగం అయిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. అలాగే, అత్యంత ముఖ్యమైన పాత్రలో యంగ్ హీరో సత్యదేవ్ కనిపించబోతున్నాడు. వీళ్లతో పాటు మాఫియా డాన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తోన్న విషయం తెలిసిందే.

శరవేగంగా.. ఇప్పుడు ముంబైలో
‘గాడ్ ఫాదర్' మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్లలో కొన్ని షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ ముంబై వెళ్లింది. ఈరోజు నుంచే అక్కడ షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

చిరంజీవి మూవీలో అనసూయ
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘గాడ్ ఫాదర్' మూవీలో తెలుగు యాంకర్ కమ్ హీరోయిన్ అనసూయ భరద్వాజ్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, ఇందులో ఆమె చేసే పాత్ర గురించి కూడా ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అనసూయ ఈ చిత్రంలో చిరంజీవి చెల్లిగా నటిస్తుందని కొందరు అంటుంటే.. జర్నలిస్టు పాత్ర అని మరికొందరు చెప్తున్నారు.

ఊహించని పాత్రలో యాంకర్
చిరంజీవి నటిస్తోన్న ‘గాడ్ ఫాదర్' మూవీలో అనసూయ చేసే పాత్ర గురించి తాజా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. లూసీఫర్ మూవీలో ఓ అమ్మాయి ఒకరి చేతిలో మోసపోయి బిడ్డను కంటుంది. ఆమెను హీరో చేరదీస్తాడు. ఎంతో అమాయకంగా ఉండే ఆ అమ్మాయి.. తన బిడ్డకు తండ్రి హీరోనే అని కేసు పెడుతుంది. ఈ పాత్రనే అనసూయ చేస్తుందట.
Recommended Video


సినిమానే మలుపు తిప్పే పాత్ర
మలయాళంలో ఈ పాత్రను షాన్ రోమీ అనే అమ్మాయి చేసింది. అందులో అమాయకంగా కనిపిస్తూ చివరకు హీరోకే ఎదురు తిరుగుతుంది. దీంతో అతడు జైలుకు వెళ్తాడు. అంత ముఖ్యమైన పాత్రలోనే అనసూయ నటిస్తుందని అంటున్నారు. ఇదే కనుక నిజం అయితే ఇద్దరు అగ్ర నటుల అభినయానికి ప్రేక్షకుల ఫిదా అవ్వాల్సిందే అని టాలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











