ఊరూరా తిరుగుతూ నాటకాల ప్రదర్శన.. అనసూయ చేసేది అదే!
'నటసామ్రాట్' అనే మరాఠీ సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు డైరెక్టర్ కృష్ణవంశీ. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. కృష్ణవంశీ సతీమణి రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ సరసన నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు 'రంగమార్తాండ' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేస్తూ షూటింగ్ సమయంలోనే భారీ హైప్ క్రియేట్ చేశారు.
ఈ సినిమాలో జబర్దస్త్ బ్యూటీ అనసూయ కూడా ఓ ముఖ్యపాత్ర పోషిస్తోంది. దీంతో ఆమె ఏ పాత్రలో కనిపించనుందనే ఆత్రుత జనాల్లో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా అందిన సమాచారం మేరకు 'రంగమార్తాండ' సినిమాలో 'రంగస్థల నటి'గా అనసూయ కనిపించనుందని తెలుస్తోంది. ఊరూరా తిరుగుతూ నాటకాలు ప్రదర్శించే ఓ కళాకారిణి పాత్ర ఆమె పోషిస్తున్నట్లు టాక్. గత సినిమాలతో పోల్చితే ఇందులో ఆమె లుక్ మరింత గ్లామరస్‌గా ఉంటుందని తెలిసింది.

ఒరిజినల్ వెర్షన్‌లో నానా పటేకర్ పోషించిన పాత్రను తెలుగు వర్షన్‌లో ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణి రమ్యకృష్ణను కృష్ణవంశీ డైరెక్ట్ చేయబోతుండటం విశేషం. ఈ సినిమాకు అభిషేక్ అండ్ మధు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. చూడాలి మరి భార్య సహకారంతో కృష్ణవంశీ మరోసారి హాట్ సాధిస్తారా? అనేది.


Click it and Unblock the Notifications











