Anasuya Bharadwaj అల్లు అర్జున్‌పై అనసూయ ప్రతీకారం.. వీరరేంజ్లో భారీ స్కెచ్!
యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలగు ప్రేక్షకులకు అనసూయ ఎంతో సుపరిచితం. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీని దక్కించుకుంది. అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ వంటి ఇండస్ట్రీల్లో ఫేమస్ తెచ్చుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకోబోతుంది. దానికి అల్లు అర్జున్ మీద ప్రతీకారం భారీ లెవెల్ లో ప్లాన్ చేసిందట. అసలు మ్యాటర్ ఈ స్టోరీలో చూసేద్దాం.
జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న బ్యూటీ అనసూయ భరద్వాజ్. ఇక బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా కొనసాగిన ఈ బ్యూటీ.. కొన్నాళ్ల క్రితం జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసింది. పూర్తిగా సినిమాలతో బిజీగా మారిపోయింది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా పాపులర్ అయిన ఈ బ్యూటీ పుష్ప సినిమాతో మరింత క్రేజ్ కొట్టేసింది. ఇక పుష్ప సినిమా తర్వాత లేడి ఓరియేంటెడ్ చిత్రాలతో పాటు పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తు ప్రేక్షకులను అలరిస్తుంది.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమాలో దాక్షాయనిగా అనసూయ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్రను మించేలా పుష్ప-2 లో అనసూయ పాత్రను సుకుమార్ హైలెట్ చేయబోతున్నారని తెలుస్తోంది. పుష్ప చిత్రంలో అనసూయను ఊహించుకొని దాక్షయని పాత్రను సెట్ చేయగా... ఇప్పుడు ఆ పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఫుష్ప 2 లో ఉండనుందని సమాచారం.

పుష్ప మొదటి భాగంలో దాక్షాయిని పాత్రలో మంగళం శీను భార్యగా అనసూయను చూపించారు సుకుమార్..అంతేకాదు విలన్ గా చూపించి అందరినీ షాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంలో చాలామంది పవర్ఫుల్ విలన్స్ ను కూడా తీసుకున్నప్పటికీ.. దాక్షాయిని పాత్రకు మాత్రం రివేంజ్ తీర్చుకోవడానికి రెండు బలమైన కారణాలు ఉండేలా ప్లాన్ చేశారు సుకుమార్. ఒకటి దాక్షాయని తమ్ముడిని హత్య చేయడం, అలాగే తన భర్త నుంచి సిండికేట్ లాక్కొని పుష్ప ఎదగడం అని తెలుస్తోంది.
తన భర్త సునీల్ పై తనే దాడి చేసేలా పరిస్థితి తీసుకురావడంతో పుష్ప పైన దాక్షాయిని ఎలా రీవేంజ్ తీర్చుకుంటుందనేది పుష్ప 2లో సుకుమార్ చూపించబోతున్నాడు. అంతేకాకుండా మరో విలన్ బన్వర్లాల్ షేక్షావత్ తో దాక్షాయిని చేతులు కలిపి పుష్పని ఎలా చంపాలనేది ప్లాన్ చేస్తుందని ఓ న్యూస్ లీక్ అయింది. ఇప్పటివరకు అనసూయ చేసిన రోల్స్ కంటే.. దాక్షయని రోల్ మైలురాయిగా నిలిచిపోతుందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. పుష్ప-2 లో అనసూయ అరాచకం సృష్టిస్తుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చనడుస్తోంది.

ఇక పుష్ప 2 సినిమా విషయానికి వస్తే.. షూటింగ్ జరుపుకుంది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. అల్లు అర్జున్ ఇందులో ఎలా రూల్ చేశారని చూపిస్తారు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప -2 చిత్రాన్ని ఆగస్టు 15న పాన్ వరల్డ్ లెవెల్ లో విడుదల చేయబోతున్నారు. ఇక ఈసినిమాకు పార్ట్ 3 కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











