అల్లు అర్జున్‌తో తలపడుతున్న జబర్దస్త్ యాంకర్.. అనసూయలో ఈ టాలెంట్ కూడా ఉందా?

జబర్దస్త్ బ్యూటీ అనసూయ.. అల్లు అర్జున్‌తో సమరానికి సై అనేసిందట. బన్నీ పాలిట విలన్‌గా మారిన ఆమె.. ఇప్పటికే ఆయనతో తలపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి అనసూయ- అల్లు అర్జున్‌ సమరానికి సంబంధించి అసలు మ్యాటర్ ఏంటి? ఈ ఇద్దరూ దేనికోసం తలపడుతున్నారు? వివరాల్లోకి పోతే..

రామ్ చరణ్ అత్త.. రంగమ్మత్త

రామ్ చరణ్ అత్త.. రంగమ్మత్త

ఇటీవలే రంగస్థలం సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ కొట్టేశాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో రంగమ్మత్తగా అనసూయ చూపిన అభినయం, తెచ్చుకున్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అల్లు అర్జున్‌తో అనసూయ సమరం

అల్లు అర్జున్‌తో అనసూయ సమరం

ఇక ఇప్పుడు అదే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అయింది అనసూయ. అయితే ఈ సారి ఆమె కోసం విలన్ క్యారెక్టర్ డిజైన్ చేశాడట సుకుమార్. పవర్ ఫుల్ పాత్రను రాసి అల్లు అర్జున్‌తో ఆమె సమరానికి తెర రూపమిస్తున్నారట.

ఎర్రచందనం స్మగ్లింగ్.. కీలకం ఆమెనే

ఎర్రచందనం స్మగ్లింగ్.. కీలకం ఆమెనే


రంగస్థలం లాంటి భారీ హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సుకుమార్.. తన తదుపరి ప్రాజెక్టును స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అనసూయ పాత్ర కీలకంగా ఉండబోతుందని సమాచారం.

ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్

ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్

ఈ చిత్రంలో విలన్ పాత్రలో అనసూయ నటించబోతుందని ప్రచారం ఊపందుకుంది. పాత్ర నచ్చడంతో ఈ రోల్ పోషించడానికి రెడీ అయిందట అనసూయ. ఇప్పటికే ఈ సినిమా స్టార్ట్ చేసిన సుకుమార్.. మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసి రెండో షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు.

పల్లెటూరి లొకేషన్స్.. రష్మిక మందన్నతో

పల్లెటూరి లొకేషన్స్.. రష్మిక మందన్నతో


రంగస్థలం లాగే పల్లెటూరి లొకేషన్స్ లోనే చిత్రీకరించబడుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. చూడాలి మరి ఇటు అనసూయతో తలపడుతూ మన స్టైలిష్ స్టార్ రష్మిక మందన్నతో ఎలా రెచ్చిపోతాడనేది?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X