For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గతంలో రామ్ చరణ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌! స్కెచ్ రెడీ.. సిద్దమైన అనసూయ

  |

  బుల్లితెర, వెండితెర, ఆన్‌లైన్ వేదిక అన్నింటిలోనూ సూపర్ పాపులారిటీ ఉన్న సెలెబ్రిటీ అనసూయ. చురుకుదనం దాన్ని తలదన్నే అందం రెండూ ఆమె సొంతం. అందుకే అనసూయకు వరుస సినిమా ఛాన్సులు వస్తున్నాయి. రోజు రోజుకూ క్రేజ్ పెంచుకుంటూ వస్తున్న ఈ రంగమ్మత్త కోసం స్పెషల్ క్యారెక్టర్స్ రెడీ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలోనే సుకుమార్ తన కొత్త సినిమాలో ఈమె కోసం అదిరిపోయే రోల్ సిద్ధం చేశారట. వివరాల్లోకి పోతే..

  రంగస్థలంతో భారీ బ్లాక్ బస్టర్.. అనసూయ పాపులారిటీ

  రంగస్థలంతో భారీ బ్లాక్ బస్టర్.. అనసూయ పాపులారిటీ

  ఇటీవలే రంగస్థలం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు సుకుమార్. రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో రంగమ్మత్తగా అనసూయ చూపిన అభినయం, తెచ్చుకున్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

  కొంత గ్యాప్.. ఆ తర్వాత స్కెచ్

  కొంత గ్యాప్.. ఆ తర్వాత స్కెచ్

  అయితే రంగస్థలం లాంటి భారీ హిట్ తర్వాత కొత్త గ్యాప్ తీసుకున్న సుకుమార్.. తన తదుపరి ప్రాజెక్టును స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమయ్యారు. స్క్రిప్ట్ దశలోనే తన సినిమాలోని క్యారెక్టర్స్‌‌కి ఎవరెవరు అవసరం, వారి కోసం ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేయాలి? అని లెక్కలేసుకోవడం ఈ క్రియేటివ్ డైరెక్టర్ స్టైల్.

  అడ్జెస్ట్ చేసుకుంటున్న అనసూయ

  అడ్జెస్ట్ చేసుకుంటున్న అనసూయ

  ఇందులో భాగం గానే రంగస్థలంలో రంగమ్మత్త.. అదేనండీ అనసూయ కోసం ఓ సూపర్బ్ క్యారెక్టర్‌ డిజైన్ చేశారట సుక్కు. అది కూడా ఫుల్ లెంగ్త్ రోల్ ఉండేలా. ఈ విషయం అనసూయతో కూడా చెప్పడంతో ఇప్పటినుంచే ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేసిందని తెలుస్తోంది. ఈ మేరకు మరోసారి సుక్కు డైరెక్షన్‌లో తన టాలెంట్ చూపాలని ప్లానింగ్ మొదలు పెట్టేసిందట.

  బన్నీ అభిమానుల సంబరం

  బన్నీ అభిమానుల సంబరం

  అల్లు అర్జున్ కొత్త సినిమాలో అనసూయ క్యారెక్టర్ సుకుమార్ డిజైన్ చేస్తున్నారంటే అందులో ఏదో క్రియేటివిటీ దాగి ఉంటుందని, సో తమ అభిమాన హీరోతో రంగమ్మత్త హంగామా వెండితెరపై చేసేయొచ్చని ఇప్పటి నుంచే ఖుషీ అవుతున్నారు బన్నీ అభిమానులు. చూడాలి మరి వచ్చే ఏడాది సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో అనసూయ నటిస్తుందా? లేదా అనేది.

  రష్మిక మందన్న పై సుకుమార్ కన్ను

  రష్మిక మందన్న పై సుకుమార్ కన్ను

  ఇక్కడ మరో కీలకమైన అంశం ఏంటంటే.. ఈ చిత్రంలో రష్మిక మందన్నను హీరోయిన్‌గా ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 'ఛలో' అంటూ టాలీవుడ్ గడప తొక్కిన ఈ భామ ప్రెసెంట్ క్రీజీ హీరోయిన్‌గా పాపులారిటీ తెచ్చుకుంది. ఈ మేరకు సుకుమార్ కన్ను రష్మిక మందన్న పై పడిందని తెలుస్తోంది. వీటన్నింటిపై త్వరలోనే క్లారిటీ కూడా రానుందని సమాచారం.

  అప్పటి లాగే ఇప్పుడు కూడా!

  అప్పటి లాగే ఇప్పుడు కూడా!

  ఇక ఈ సినిమాను కూడా రంగస్థలం లాగే పల్లెటూరి నేపథ్యంలోనే రూపొందించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. అంతేకాదు రంగస్థలంలో రామలక్ష్మిగా సమంత ఎలాగైతే అలరించిందో అంతకు మించి రష్మిక అలరించేలా సుక్కు స్కెచ్ వస్తున్నారట.

  English summary
  stylish star Allu Arjun has announced a new project with director Sukumar. Meanwhile, Allu Arjun is also concentrating on the Trivikram Srinivas directorial.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X